వర్షా కాలంలో ఈ విధంగా చేయండి .డిహైడ్రేషన్ సమస్య దరిచెరదు.?

సాదారుణంగా చల్లటి వాతావరణం ఉన్నప్పుడు అంతగా దాహం వేయదు. దీంతో చాలామంది నీటిని తాగడం తగ్గిస్తారు. ఇంకా వర్షాకాలంలో అయితే చల్లటి వాతావరణం ఉంటుంది.కాబట్టి దాహం కూడా తగ్గిపోతుంది.


నీళ్లు పండ్లు కూరగాయలు హెర్బల్ డ్రింక్స్ తీసుకుంటే డిహైడ్రేషన్ సులువుగా నివారించవచ్చు.వర్షాకాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం కూడా ఉంటుంది. దీనివల్ల నీళ్లు తాగాలనిపించదు ఫలితంగా శరీరం డిహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది. కాబట్టి, వర్షాకాలంలో మన శరీరం హైడ్రేట్ గా ఉండేందుకు ఈ సులువైన చిట్కాలను పాటిస్తే చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Monsoon Season : వర్షా కాలంలో ఈ విధంగా చేయండి …డిహైడ్రేషన్ సమస్య దరిచెరదు…?

హెర్బల్ టీలు

కేవలం నీళ్లు తాగడం బోర్ అనిపిస్తే, అల్లం టీ, పుదీనా టీ లేదా నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగండి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా జీర్ణ క్రియను,రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నీళ్లు,ఆహారం విషయంలో జాగ్రత్తలు

వర్షాకాలంలో తక్కువగా దాహం వేయడంతో ఆ రోజంతా శరీరానికి కావలసిన నీళ్లు సరిగ్గా అందవు. కాబట్టి రోజు తప్పనిసరిగా నీటిని తాగాలి. పుచ్చకాయ, దోసకాయ, టమాట,నారింజ లాంటి నీరు ఎక్కువ ఉండే పండ్లను కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకుంటే డిహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది.

నీళ్లు తాగే అలవాటు

చల్లగా ఉందని నీరు తాగడం మానేయకండి,రోజుకు కనీసం 8 గ్లాసులు నీళ్లు తాగితే మంచిది. బాటిల్ను దగ్గర పెట్టుకొని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండండి.

కొన్ని డ్రింక్స్ లకు స్వస్తి చెప్పండి

వర్షా కాలంలో టీ,కాఫీ, ఆల్కహాలు ఎక్కువగా తాగితే అంత మంచిది కాదు.ఇవి శరీరంలో నీటిని తగ్గిస్తుంది. దీంతో డిహైడ్రేషన్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది .కాబట్టి వీటిని వీలైనంతవరకు తగ్గించి ఎక్కువగా నీటిని ఇతర హెల్తీ డ్రింక్స్ ని తీసుకుంటే ఉత్తమం.

డిహైడ్రేషన్ లక్షణాలు

నోరు,పెదవులు పొడిబారడం, తలనొప్పి,మూత్రం రంగు మారడం, తల తిరగడం అంటే లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. ఇవి డిహైడ్రేషన్ లక్షణాలు కావచ్చు. మొత్తానికి వర్షాకాలంలో దాహం తక్కువగా ఉంటే,నీళ్లు హెల్తి ఫుడ్స్ తీసుకుంటే ఇరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచి డిహైడ్రేషన్లో సులభంగా నివారిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.