ఆగస్టు 15, 16, 17న విద్యార్థులకు మూడు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు(Holidays) వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదిరిపోయే గుడ్ న్యూస్ లభించనుంది.
ఈ నెలలో వినాయక చవిత సెలవు ఓ గుడ్ న్యూస్ అయితే వచ్చే నెలలో కూడా హాలిడేస్ భారీగానే ఉన్నాయి. దీంతో విద్యార్థులు మళ్లీ ఎగిరిగంతేయనున్నారు.
అక్టోబర్(October)లో దసరా పండగ(Dasara Festival) సందర్భంగా ప్రభుత్వం అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులను ప్రకటించనుంది. మొత్తం 9 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 9 రోజుల పాటు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. విద్యాశాఖ అధికారిక అకడమిక్ కేలెండర్ ప్రకారం జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు మొత్తం 8 రోజుల పాటు, అలాగే క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకూ 6 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించే అవకాశం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు.

































