నేడు ఆగస్టు 22వ తేదీ శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,460 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,700 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,17,096 పలుకుతోంది. బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరగడమే అని చెప్పవచ్చు. బంగారం ధర గడచిన నెల రోజులుగా గమనించినట్లయితే లక్ష రూపాయల పైనే ట్రేడ్ అవుతోంది. బంగారం ధర స్వల్పంగా ఒడిదుడుకులకు లోన్ అవుతున్నప్పటికీ, లక్ష రూపాయల ఎగువన ఆల్ టైం రికార్డ్ స్థాయి సమీపంలో స్థిరంగా ట్రేడ్ అవుతోంది అని చెప్పవచ్చు. బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం గడచిన సంవత్సర కాలంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిణామాలు అని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా మార్కెట్లపై ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు. బంగారం అనేది ఒక సురక్షితమైనటువంటి లోహంగా చెప్పవచ్చు దీంతో ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడిగా భావించిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారం పైనే ఉంచుతున్నారు.
ఈ కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే బంగారం తో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగిపోయింది అని చెప్పవచ్చు. నిజానికి వెండి ధర చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంది. వెండి ధర దాదాపు ఒక కేజీ 1.28 లక్షల రూపాయల వరకు చేరుకుంది. బంగారం ధరతో పోటీ పడుతూ వెండి ధర కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడును వెండివైపు కూడా ఎక్కువగా తరలిస్తున్నారు. . పెళ్లికి ఉన్నఫలంగా డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం పారిశ్రామికంగా వెండి కి పెరుగుతున్న డిమాండ్ అని చెప్పవచ్చు . వెండిని ఎక్కువగా ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో ఉపయోగిస్తున్నారు. అలాగే వెండిని ఎలక్ట్రిక్ వస్తువుల తయారీలోనూ, సోలార్ ప్యానల్స్ తయారీలోనూ ఎక్కువగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో వెండి ధర భారీగా పెరుగుతోంది.
Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.
































