స్కూళ్లకు 10 రోజులు సెలవులు..ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 5 వరకు వరుస హాలీడేస్

భిన్న భాషలు..విభిన్న సంస్కృతులు ఉన్న మన భారతదేశం పండుగలకు నిలయం. ప్రతి రాష్ట్రానికి దాని స్వంత ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపు ఉంటుంది.


రాబోయే ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 5 వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్కూల్స్ కు సెలవు ఉండనుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళలో అత్యంత గొప్పగా జరుపుకొనే పండుగ ఓణం. ఈ పండుగ మతపరమైన, సాంస్కృతిక స్వభావం మాత్రమే కాకుండా సామాజిక ఐక్యత, సాంప్రదాయ శ్రేయస్సుకు చిహ్నంగా కూడా ఉంటుంది. ఓణంను కేరళ రాష్ట్ర పండుగ అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి సంవత్సరం మలయాళ క్యాలెండర్‌లోని చింగం నెలలో వస్తుంది. ఈ పండుగలో అతి పెద్ద ఆకర్షణలు పూకలం (పూల అలంకరణ), వల్లంకలి (పడవ పందెం), పులికలి (పులి నృత్యం), ఓనం సాధ్య (కేరళ స్పెషల్ థాలీ లేదా భోజనం), కథాకళి నృత్యం. ఓనం దాదాపు 10 రోజుల పాటు జరుపుకొంటారు.

ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 5 వరకు ఈ ఓణం పండుగను వివిధ రకాలను ప్రజలు సంతోషంగా జరుపుకొంటారట. తమ ఇళ్లను శుభ్రం చేసుకొని.. పూలతో అలంకరించడంతో పాటు కొత్త దుస్తులు ధరించి, బంధువులు, స్నేహితులతో ఆనందంగా జరుపుకొంటారట. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఏ విధంగా ఘనంగా జరుపుకొంటారో.. కేరళలో ఓణం పండుగ సంబరాల్లో ముగ్గులు, రంగోలి పోటీలు ఉంటాయట. వీటితో పాటు అనేక ఆటవిడుపులు కూడా ఉంటూ సంతోషంగా జరుపుకుంటారట.

ఆగస్టు 26 – అట్టచమయం, ఆటాపు పూకలం: ఓనం పండుగ ప్రారంభమయ్యే రోజు ఇది. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి పూలతో అలంకరిస్తారు. ఆగస్టు 27న చిత్తిర దినం: ఓనం తర్వాత రోజు. రంగోలిలు వేయాలి, ఇళ్ళు, దేవాలయాలను పూలతో అలంకరించాలి. ఆగస్టు 29 – చోధి దినం: ప్రజలు కొత్త బట్టలు, బహుమతులు కొనుగోలు చేసే రోజు ఇది. ఆగస్టు 30 – విషు: విషు పండుగ అసలు ప్రారంభాన్ని సూచిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు ప్రారంభమవుతాయి.

ఆగస్టు 31న అనిలం.. వల్లం కలి: ఈ రోజున పడవల పోటీకి సన్నాహాలు చేస్తారు. సెప్టెంబర్ 1, 2025 – త్రికేత: ఈ రోజున స్నేహితులు, బంధువులు కలుస్తారు. ఇది సంబంధాలను పెంచుతుంది. సెప్టెంబర్ 2 – మూలం: ఓణం ఏడవ రోజు దేవాలయాలు, బహిరంగ ప్రదేశాలలో వేడుకల రోజు. సెప్టెంబర్ 3 – పురడం: ఎనిమిదవ రోజు, ఓణం వేడుకలు అఖరికి చేరుకుంటాయి. సెప్టెంబర్ 4 – ఉత్రాడం: ఇప్పుడు తొమ్మిదవ రోజు వస్తుంది. ఇది రాజు మహాబలి రాక సందర్భంగా జరుపుకొంటారు. సెప్టెంబర్ 5 – తిరుఓనం: ఇది ఓనం పండుగలో అత్యంత ప్రత్యేకమైన చివరి రోజు, రాజు మహాబలిని స్వాగతించే రోజు.

ఓణం ప్రత్యేకత..
ఓణం పండుగను మహాబలి జ్ఞాపకార్థం జరుపుకుంటారని చెబుతారు. పురాణాల ప్రకారం.. త్రేతా యుగంలో మహాబలి అనే రాక్షస రాజు కేరళను పరిపాలించాడు. అతను చాలా దాతృత్వం, ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేవాడు. అతని ప్రజాదరణకు అసూయపడిన ఇంద్రుడు.. ఇతర దేవతలు చివరకు విష్ణువు సహాయం కోరాతాడట. అప్పుడు విష్ణువు వామనుడి రూపాన్ని ధరించి మహాబలిని నరకానికి పంపాడు. కానీ మహాబలి ప్రజలను కలవాలనే కోరికను వ్యక్తం చేశాడట. ఆ విధంగా దేవతలు అతన్ని సంవత్సరానికి ఒకసారి భూమికి రావాలని ఆశీర్వదించారు. ఈ రాక జ్ఞాపకార్థం ఓణం పండుగ జరుపుకుంటారు.

కేరళలో ఈ పండుగకు ఎక్కువ రోజులు సెలవులు ఇస్తారు. దాదాపుగా ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 5 వరకు కొన్ని స్కూళ్లకు సెలవులు ఇచ్చినట్లు సమాచారం. కేరళతో పాటు ఆ రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో కూడా ఓణం పండుగ సెలవులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.