రామోజీ ఫిలిం సిటీ సమీపంలోని ఈ ప్రాంతం మరో కూకట్ పల్లి అవుతుందా..?

హైదరాబాద్ నగరంలోని మరో ప్రాంతం కూడా మరో కూకట్ పల్లి అయ్యే అవకాశం ఉందని చాలామంది నిపుణులు పేర్కొంటున్నారు. అందులో అత్యంత ముఖ్యమైనది రామోజీ ఫిలిం సిటీ సమీపంలోని హయత్ నగర్ అని చెప్పవచ్చు. ఈ ప్రాంతం, విజయవాడకు వెళ్లే జాతీయ రహదారి పైన ఉంది. గతంలో వనస్థలిపురంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినప్పటికీ ఈ ప్రాంతంలో పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో కూకట్ పల్లి తో పోల్చి చూస్తే ఈ ప్రాంతం అంతగా ఎక్కువగా అభివృద్ధి చెందలేదు.


హైదరాబాద్ నగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది కూకట్ పల్లి అని చెప్పవచ్చు. ఇటీవల కూకట్ పల్లిలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో 7.8 ఎకరాల ఒక ప్లాటును గోద్రెజ్ సంస్థ ఏకంగా 547 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంటే ఒక్కొక్క ఎకరం 70 కోట్లకు పైగా ముడిపోయింది. దీన్నిబట్టి కూకట్ పల్లి ఏరియా ఎంత ప్రైమ్ లొకేషన్ అయిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో వాయువ్యం వైపు ఉన్నటువంటి కూకట్ పల్లి ఆసియాలోనే అతిపెద్ద హౌసింగ్ బోర్డ్ కాలనీ గా పేరు సంపాదించుకుంది. అంతే కాదు కూకట్ పల్లి నగరంలోని అన్ని ప్రాంతాలకు చక్కటి కనెక్టివిటీ ఉన్న నేపథ్యంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ఒక మంచి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ముఖ్యంగా ఐటీ హబ్ గా పేరు సంపాదించుకున్న హైటెక్ సిటీ కూడా ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఎక్కువగా ఐటీ నిపుణులు. ఈ ప్రాంతంలోనే నివాసం ఉండటం వల్ల ఇక్కడి రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు మంచి డిమాండ్ ఏర్పడింది.
అయితే హైదరాబాద్ నగరంలోని మరో ప్రాంతం కూడా మరో కూకట్ పల్లి అయ్యే అవకాశం ఉందని చాలామంది నిపుణులు పేర్కొంటున్నారు. అందులో అత్యంత ముఖ్యమైనది రామోజీ ఫిలిం సిటీ సమీపంలోని హయత్ నగర్ అని చెప్పవచ్చు. ఈ ప్రాంతం, విజయవాడకు వెళ్లే జాతీయ రహదారి పైన ఉంది. గతంలో వనస్థలిపురంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినప్పటికీ ఈ ప్రాంతంలో పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో కూకట్ పల్లి తో పోల్చి చూస్తే ఈ ప్రాంతం అంతగా ఎక్కువగా అభివృద్ధి చెందలేదు.
అయితే ప్రస్తుతం హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ చుట్టుపక్కల గ్రామాల్లో చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడి రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు చక్కటి డిమాండ్ ఏర్పడింది. ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ ఉండటంతో పాటు, ఈ ప్రాంతంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ సైతం ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న నేపథ్యంలో, అలాగే ఈ ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఎయిర్పోర్టుకు సైతం కనెక్టివిటీ ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో చక్కటి అభివృద్ధి జరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి తోడు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఆదిభట్ల ప్రాంతంలో ఐటి కంపెనీలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో హయత్ నగర్ ప్రాంతం మరో కూకట్ పల్లి అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.