అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం..రెక్టర్ స్కేల్ పై 8.0 తీవ్రత

క్షిణ అమెరికాలో కొద్ది సేపటి క్రితం పెద్దగా భూమి ప్రకంపించింది. రిక్టార్ స్కేల్ పై దీని తీవ్రత 8.0 గా నమోదు అయింది. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై ఎటువంటి వార్తలూ రాలేదు


సౌత్ అమెరికాకు, అంటార్కిటాకు మధ్యలో ఉన్న డ్రేక్ ప్యాసేజ్ అనే ప్రదేశంలో ఈ భూకంపం సంభవించింది. ఇది సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం. అంతకు ముందు ఆగస్టు 17న ఇండోనేషియా తూర్పు భాగంలో 5.8 తీవ్రతతో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. ఇందులో 29 మంది గాయపడ్డారు.

వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సెంట్రల్ సులవేసి ప్రావిన్స్‌లోని పోసో జిల్లాకు ఉత్తరాన 15 కిలోమీటర్లు (9.3 మైళ్ళు) దూరంలో భూకంపం సంభవించిందని., ఆ తర్వాత కనీసం 15 సార్లు ప్రకంపనలు సంభవించాయని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పడు అదే ప్రభావం అమెరికాలో డ్రేక్ ప్యాసేజ్ మీద కూడా పడిందని అంటున్నారు. ఇక్కడ కూడా సముద్రం లోపలే ముందు భూమి కంపిందని అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.