తెలంగాణలో 1623 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

తెలంగాణలోని నిరుద్యోగులకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్స్ తో పాటు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 1623 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు అదే నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.