Dream 11 యూజర్లు ఇక బ్యాగులు సర్దుకోవాల్సిందే.. డబ్బులు విత్‌డ్రా ఎలాగంటే.?

రిగ్గా కరోనా కాలం నుంచి ప్రతీ ఒక్కరి మొబైల్ ఫోన్లలోనూ Dream 11 యాప్ ఉండేది. ఆ సమయంలో Dream 11 అనేది దేశంలోనే ప్రముఖ ఆన్‌లైన్ స్పోర్ట్స్ ఫాంటసీ యాప్.


ఇక ఇప్పుడు ఈ యాప్ తన ఆపరేషన్స్ అన్నింటినీ మూసివేసింది. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ఆ సంస్థ. కేంద్రం ఆన్‌లైన్ గేమింగ్ బిల్-2025 తీసుకురావడంతో Dream Sportsకు చెందిన Dream 11 ఇక బంద్ కానుంది. తాము అన్ని రకాల రియల్ మనీ గేమింగ్ బిజినెస్‌లను మూసేస్తున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.

ఇక నుంచి తాము FanCode, DreamSetGo, Dream Game Studiosను నడుపుతామని స్పష్టం చేసింది. ఇక 2024 ఆర్ధిక సంవత్సరంలో Dream Sports ఆదాయం రూ. 9,600 కోట్లు కాగా అందులో 90 శాతం Dream 11 నుంచే వచ్చింది. అలాగే ‘మీ ఖాతా బ్యాలెన్స్ సురక్షితంగా ఉంది. మీరు Dream11 యాప్ నుంచి ఉపసంహరించుకోవడానికి అందుబాటులో ఉంది’ అనే మెసేజ్ యూజర్లకు ప్లాట్‌ఫామ్‌లో డిస్‌ప్లే అవుతోంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం కొత్త గేమింగ్‌ యాక్ట్‌ను తీసుకొస్తోంది. రియల్-మనీ గేమ్‌లను నిషేధించడం.. ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించడానికి దోహదపడనుంది ఈ చట్టం. అదే సమయంలో e-స్పోర్ట్స్, సోషల్ ఆన్‌లైన్ గేమింగ్‌లోనూ ఆర్థిక వాటా లేకుండా చూసుకుంటుంది. డబ్బులతో కూడిన క్రికెట్‌ బెట్టింగ్‌ లాంటి స్కిల్‌ గేమ్స్‌తోపాటు.. పోకర్‌, రమ్మీ లాంటి చాన్స్‌ తీసుకునే ఆన్‌లైన్‌ ఆటలను ఎవరైనా ప్రమోట్‌ చేసినా… ఆఫర్‌ చేసినా.. అందులో పెట్టుబడులు పెట్టినా ఇకపై జైలుకు వెళ్లక తప్పదు. అలాంటి ఆన్‌లైన్‌ ఆటల్లో అసలు ఆర్ధిక లావాదేవీలు జరగకుండా బ్యాంకులు, పేమెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌ నుంచి ప్రాసెసింగ్‌ను నిషేధిస్తారు. దీనివల్ల అసలు పేమెంట్స్‌ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఈ నిబంధనలను పాటించకుండా ఎవరైనా అతిక్రమిస్తే 3 నుంచి 5ఏళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానాలు ఉంటాయి. ప్రమోషన్‌ చేసే వారికి 2 ఏళ్ల వరకు జైలుశిక్ష పడొచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.