రైలునూ అద్దెకు తీసుకోవచ్చు

పెళ్లిళ్లు, శుభకార్యాల సమయాల్లో ఎక్కువ సంఖ్యలో బంధు, మిత్రులున్న సమయంలో రైలు కోచ్‌లనూ రిజర్వ్‌ చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా..


మన బడ్డెట్‌లో ఈ సదుపాయం పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు మీకోసం..

  • కనిష్ఠంగా ఒకటి, గరిష్ఠంగా 18(అవసరమైతే 24) కోచ్‌లను బుక్‌ చేసుకోవచ్చు. ఒక్కో కోచ్‌కు రూ.50 వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. రెండు బోగీలే చాలనుకుంటే రూ.లక్ష డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

    పది, పన్నెండు బోగీలు అవసరమైనప్పటికీ 18 బోగీల సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.9 లక్షలు చెల్లించాలి. ఎంచుకున్న బోగీలు, దూరాన్ని బట్టి రైల్వే అధికారులు ధర నిర్ణయిస్తారు. రైలును బుక్‌ చేసుకున్నప్పుడు 18 బోగీల్లోని ప్రయాణికుల మొత్తం ఎంత అవుతుందో ఆ మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని పది పని దినాల్లో చెల్లిస్తారు. అంతకు తక్కువ బోగీల్లో ప్రయాణించి ఉంటే ఆ మొత్తం పట్టుకొని సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి చెల్లిస్తారు.

  • గూగుల్‌ ఓపెన్‌ చేసి ఎఫ్‌టీఆర్‌ ఐఆర్‌సీటీసీ అని టైప్‌ చేయగానే వెబ్‌సైట్‌ వస్తుంది. మన సమాచారాన్ని నమోదు చేసి రిజిస్టర్‌ కావాలి. ఎఫ్‌టీఆర్‌ కోచ్‌ బుకింగ్‌ అంశాన్ని ఎంచుకోవాలి. బోగి కావాలంటే కోచ్‌ అని..

    రైలు కావాలంటే రైలు అని ఎంపిక చేసుకోవాలి. స్లీపర్, త్రీటైర్‌ ఏసీ, టూటైర్‌ ఏసీ, మొదటి తరగతి ఏసీలను ఎంపిక చేసుకొని, ఏ స్టేషన్‌లో ఎక్కుతారు, ఎక్కడ దిగుతారన్న వివరాలు పొందుపర్చాలి. కనీసం 30 రోజుల ముందుగా రైలు లేదా కోచ్‌లను రిజర్వ్‌ చేసుకోవాలి. సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించిన వారంలోపు కన్ఫర్మేషన్‌ వస్తుంది.

  • ఒక్కో బోగికి 72 సీట్లు ఉంటాయి. త్రీటైర్‌ ఏసీకి 44 సీట్లు, 1 టైర్‌ ఏసీకి 24 సీట్లు ఉంటాయి. ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. అత్యవసరమైతే సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో కమర్షియల్‌ విభాగ అధికారులను సంప్రదించాలని రైల్వే అధికారులు తెలిపారు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.