ఢిల్లీలోని సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB).. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న కోర్ట్ అటెండెంట్, రూమ్ అటెండెంట్, సెక్యురిటీ అటెండెంట్ పోస్టుల భర్తీకీ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 334 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 26వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
పోస్టుల వివరాలు..
- కోర్ట్ అటెండెంట్ పోస్టుల సంఖ్య: 295
- కోర్ట్ అటెండెంట్(ఎస్) పోస్టుల సంఖ్య: 22
- కోర్ట్ అటెండెంట్(ఎల్) పోస్టుల సంఖ్య: 1
- రూమ్ అటెండెంట్(హెచ్) పోస్టుల సంఖ్య: 13
- సెక్యూరిటీ అటెండెంట్ పోస్టుల సంఖ్య: 3
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా జనవరి 1, 2025వ తేదీ నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నోటిఫికేషన్లో సూచించిన విధంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలున్నవారు ఆన్ లైన్ ద్వారా సెప్టెంబర్ 24, 2025వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు దరఖాసస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవరసం లేదు. టైర్ 1 (ఆన్లైన్ రాత పరీక్ష), టైర్ 2 (ఇంటర్వ్యూ) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
































