స్మోకింగ్ చేయకపోయినా నోటి క్యాన్సర్ ముప్పు! ఎందుకో తెలుసా..?

సాధారణంగా స్మోకింగ్ లేదా పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని అనుకుంటారు. కానీ, పొగాకు ఉత్పత్తులు వాడకపోయినప్పటికీ జెన్ జీ, మిలియనీల్స్‌కు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే..


‘క్యాన్సర్’ అన్న మాట వినగానే భయం కలగడం సహజం. శరీరానికి ఎన్నో రకాల క్యాన్సర్లు సోకే అవకాశమున్నప్పటికీ.. పొగాకు వల్లే ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. ప్రధానంగా పొగతాగడం (స్మోకింగ్), మద్యం సేవించడం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా నోటి క్యాన్సర్ అంటేనే, సిగరెట్‌, బీడి, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు గుర్తుకువస్తాయి. కానీ, తాజా అధ్యయనాలు ఒక షాకింగ్ నిజాన్ని వెల్లడించాయి. పొగాకు ఉత్పత్తులు వాడకపోయినప్పటికీ నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదముందనీ హెచ్చరిస్తున్నాయి. పొగాకు ఉపయోగించపోయినా క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలివే..

స్మోకింగ్ చేయకపోయినా మిలీనియల్స్, జెన్ జీ నోటి క్యాన్సర్ ముప్పు అధికంగా ఎదుర్కొంటున్నారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఫ్రెండ్స్, కొలీగ్స్‌తో తరచూ మందుపార్టీల్లో పాల్గొనడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. . 2017లో ‘జర్నల్ ఆఫ్ ది నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌’లో ఇచ్చిన నివేదికలోనూ ఇదే స్పష్టమైంది. మరిన్ని కారణాలు ఇవే..

1. అధిక మద్యపానం (Alcohol Consumption)

పొగ తాగకపోయినా, మద్యం సేవించే వ్యక్తులకు నాలుక, నోటి క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి.

2. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV)

HPV లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే వైరస్‌. ముఖ్యంగా టైప్ 16, 18 బారిన పడిన వారికి నోటి క్యాన్సర్‌తో పాటు ఇతర రకాల క్యాన్సర్లకూ గురయ్యే అవకాశముందంటున్నారు వైద్యులు.

3. నోటి పరిశుభ్రత లోపం

బ్రషింగ్ సరిగా చేయకపోవడం, తరచూ డెంటల్ చెకప్‌ లేకపోవడం వంటివి ఇన్ఫెక్షన్లు, నోటి వ్యాధులకు దారితీస్తాయి. ఈ సమస్య నెమ్మదిగా అభివృద్ధి చెంది నోటిలో క్యాన్సర్ కారకాలను సృష్టించే ప్రమాదముందని పేర్కొంటున్నారు నిపుణులు.

4.ఓరల్ లైకెన్ ప్లానస్

ఈ వ్యాధి ద్వారా నోటిలో తెల్లటి మచ్చలు, శ్లేష్మ పొరలపై ప్రభావం పడుతుంది. ఇది నోటి క్యాన్సర్‌కు ముందస్తు సంకేతంగా పరిగణించబడుతుంది.

5. తమలపాకు, వక్క నమలడం

పొగాకు ఉత్పత్తులు వాడకపోయినా తమలపాకులు, అరెకా లేదా వక్కలు కలిపి తరచూ నమిలే అలవాటు ఉంటే ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్, ల్యూకోప్లాకియా వంటి స్థితులకు దారితీస్తాయి. ఇవి పునరుత్పత్తి అవుతూ చివరికి క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది.

6. జన్యుపరమైన కారకాలు (Genetic Factors)

Li-Fraumeni Syndrome వంటి అరుదైన జన్యుపరమైన పరిస్థితులు కూడా స్మోకింగ్ చేయని వ్యక్తుల్లోనూ నోటి క్యాన్సర్ రావడానికి కారణమవుతాయి.

ముందస్తు జాగ్రత్తలు ఏమిటి?

  • రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి.
  • డెంటల్ చెకప్‌ను నిర్లక్ష్యం చేయవద్దు.
  • మద్యం వాడకాన్ని నియంత్రించాలి.
  • ఏదైనా శారీరక మార్పు (మచ్చలు, నొప్పులు) కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
  • HPV వ్యాక్సినేషన్‌పై అవగాహన కలిగి ఉండాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.