తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఏపీ జేఏసీ అమరావతి(AP JAC Amaravati) రాష్ట్ర కార్యవర్గం తాజాగా విజయవాడ రెవెన్యూ భవన్(Vijayawada Revenue Bhavan)లో సమావేశం నిర్వహించారు.
వచ్చే 3 నెలల్లోనే తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మహిళా ఉద్యోగులకు ఇస్తున్న చైల్డ్ కేర్ లీవ్స్‌ను రెండేళ్లకు పెంచాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు సైతం చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు డిమాండ్ చేశారు.
































