డీమార్ట్ బంపర్ ఆఫర్స్.. వినాయక చవితికి సగం ధరకే షాపింగ్

పండుగలు వస్తున్నాయంటే చాలు, షాపింగ్ మాల్స్‌లో ఆఫర్ల హోరు మొదలవుతుంది. ఈసారి వినాయక చవితిని పురస్కరించుకుని డీమార్ట్ వినియోగదారులకు బంపర్ ఆఫర్లు అందిస్తోంది.


కేవలం సగం ధరకే అనేక ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఈ పండుగ సీజన్‌లో ఏయే ఉత్పత్తులపై ఎలాంటి డిస్కౌంట్లు ఉన్నాయో చూద్దాం.

సగం ధరకే గ్రాసరీస్, పప్పులు

వంటగదికి కావాల్సిన నిత్యావసరాలపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఆర్గానిక్ కందిపపప్పు (1 కేజీ) అసలు ధర రూ. 365 కాగా.. డీమార్ట్‌లో రూ. 182కే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా సఫోలా మీల్ మేకర్ రూ. 150 నుంచి రూ. 75కి, ఎపిస్ క్లాసిక్ సీడెడ్ ఖర్జూరాలు (అర కేజీ) రూ. 199 నుంచి రూ. 99కి తగ్గాయి. ఈస్ట్రన్ కారం పొడి (అర కేజీ) కూడా రూ. 200 నుంచి రూ. 100కే లభిస్తోంది. పప్పులు, మసాలాలు వంటివి సగం ధరకే అందుబాటులో ఉండటం గమనార్హం.

చాక్లెట్స్, బిస్కెట్స్‌పై భారీ ఆఫర్స్

పిల్లల కోసం చాక్లెట్లు, బిస్కెట్లు కొనేందుకు ఇదే సరైన సమయం. సన్ ఫీస్ట్ డార్క్ ఫ్యాంటసీ యమ్మీఫిల్ పై ప్యాకెట్ రూ. 180 నుంచి కేవలం రూ. 83కే లభిస్తోంది. బ్రిటానియా గుడ్‌డే చోకోచిప్స్ (400 గ్రాములు) ప్యాకెట్ రూ. 150 నుంచి రూ. 75కి, కరాచీ చాయ్ బిస్కెట్ (400 గ్రాములు) రూ. 180 నుంచి రూ. 90కి తగ్గాయి. సుమారు 100 రకాల బిస్కెట్లు, చాక్లెట్లు ఇలాగే సగం ధరకే లభిస్తున్నాయి.

తక్కువ ధరలో..

ఈ నెల డీమార్ట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిలో కొన్ని ఉత్పత్తులు సగం ధరకే లభిస్తున్నాయి. ఉదాహరణకు.. రూ. 120 విలువైన బ్రిటానియా జిమ్ జామ్ పాప్స్ కుకీస్ రూ. 60కే, అలాగే రూ. 460 ఉండే బ్రిటానియా చీజ్ స్లైసెస్ రూ. 230కే లభిస్తున్నాయి. ఇంటి శుభ్రతకు వాడే సాని ఫ్రెష్ టాయిలెట్ క్లీనర్ రూ. 225కి బదులు రూ. 112కే అందుబాటులో ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం కోసం చూసేవారికి.. రూ. 320 విలువైన యోగా బార్ మిల్లెట్ మ్యూస్లీ నట్స్ రూ. 160కి, బికాజీ చౌపతీ బేల్‌పురి (110 గ్రాములు) రూ. 49కి బదులు రూ. 24కే లభిస్తున్నాయి.

కిచెన్ అప్లియాన్సెస్‌పై..

కిచెన్‌కు అవసరమైన పెద్ద వస్తువులపైనా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. బటర్‌ఫ్లై స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ (5.5 లీటర్లు) అసలు ధర రూ. 4,851 కాగా, ఇప్పుడు కేవలం రూ. 1,949కే లభిస్తోంది, అంటే రూ. 2,902 ఆదా చేసుకోవచ్చు. పిజియన్ హార్డ్ ఆనోడైజ్డ్ ప్రెషర్ కుక్కర్ (3 లీటర్లు) రూ. 3,445 నుంచి రూ. 1,699కి తగ్గింది. అంతేకాకుండా పర్సనల్ కేర్ ఉత్పత్తులైన చందన్ స్పర్శ సోప్ (150 గ్రా. 4 ప్యాక్) రూ. 220 నుంచి రూ. 110కి, లైఫ్‌బాయ్ లెమన్ అలో ఫ్రెష్ సోపులు (125 గ్రా. 7 ప్యాక్) రూ. 370 నుంచి రూ. 185కి లభిస్తున్నాయి. సంతూర్ ప్యూర్ గ్లో బాతింగ్ బార్ (125 గ్రా. 4 ప్యాక్) రూ. 405కి బదులు రూ. 202కే అందుబాటులో ఉన్నాయి. ఇంకా గ్రేస్, వివెల్, ఖాదీ వంటి బ్రాండ్ల ఉత్పత్తులు కూడా సగం ధరకే లభిస్తున్నాయి.

మొత్తంగా ఈ వారం డీమార్ట్‌లో గ్రాసరీలు, కిచెన్ అప్లియాన్సెస్, పర్సనల్ కేర్ ఉత్పత్తులు, ఫర్నిచర్, డెకార్ వంటి దాదాపు అన్ని రకాల వస్తువులపై 50శాతానికి పైగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. కొన్ని ఉత్పత్తులపై 60-70శాతం వరకు డిస్కౌంట్ కూడా ఉంది. ఇది నెలాఖరు, పైగా పండుగ సమయం కావడంతో స్టాక్‌ను క్లియర్ చేయడానికి డీమార్ట్ ఈ భారీ ఆఫర్లను ప్రకటించిందని తెలుస్తోంది. కాబట్టి ఈ వారంలో షాపింగ్ చేయాలనుకునేవారు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.