రామ్ చరణ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల ఖాస్ కాలేదు.. ఎంతో బాధను అనుభవించానంటూ ఉపాసన సంచలన పోస్ట్

మెగా కోడలు ఉపాసన(Upasana Konidela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామ్ చరణ్ భార్యగా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా అపోలో హాస్పిటల్ వైస్ చైర్ పర్సన్‌గా ఎంతోమందికి సాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటుంది.


అలాగే పలు బిజినెస్‌లు చూసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. తాజాగా, ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టి అందరినీ షాక్‌కు గురి చేసింది. ‘ఖాస్ ఆద్మీ పార్టీ'(Khas Aadmi Party) గురించి తన ఆలోచన పంచుకుంటూ.. ”సంపద, హోదా, కీర్తి ఒకరి పట్ల చూపించే దయ ఒక వ్యక్తిని నిజమైన ఖాస్‌గా నిలబెడుతుందని నేను అనుకుంటున్నాను. నేటి సమాజంలో ఉన్న ప్రజలు వారి స్వాభావిక లక్షణాల కంటే కూడా బాహ్య లక్షణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

నేను కూడా ప్రత్యేక వ్యక్తిగా నిలబడ్డాను. దానికి కారణం నా కుటుంబం నుంచి వచ్చిన వ్యాపార వారసత్వం కాదు. అలాగే ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్న ఇంటికి కోడలిగా వెళ్లడం, రామ్ చరణ్‌(Ram Charan)ను పెళ్లి చేసుకోవడం వల్ల నేను ఖాస్ అవ్వలేదు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దాని వెనుక ఎంతో ఒత్తిడి, బాధను అనుభవించాను. ఎలాగైనా సరే జీవితంలో ఎదగాలని తపన పడ్డారు. అందుకే ఈరోజు నేను ఖాస్‌గా నిలబడ్డాను. అసలు నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో సార్లు కింద పడ్డాను. పడిన ప్రతిసారి పైకి లేచి నిలబడ్డాను. మళ్లీ మళ్లీ నేను నా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కష్టపడ్డాను అందుకే నేను ఖాస్ అయ్యాను. కొన్నిసార్లు నన్ను నేను కూడా అవమానించుకున్నాను.

నేను మీతో నిజాయితీగా ఉండాలనుకున్నాను. అందుకే మీకు నా స్టోరీ చెప్పాను. నా బలాన్ని మళ్లీ కనగొనడానికి ఒక రిసెట్ అవసరం. ఇది రాయడం వల్ల నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల, విలువల పట్ల కృతజ్ఞత కలిగి ఉండగలిగాను. అది మీకు కూడా సహాయపడుతుంది అనుకుంటున్నా.మనం ఎదుగుతూనే ఉందాం. పైకి లేస్తూనే ఉందాం. మనం ఎంత గొప్పగా ఉన్నామో ఎప్పటికీ మర్చిపోకూడదు” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.