వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
రాష్ట్రంలోని వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి లోకేశ్ సోమవారం ‘ఎక్స్’లో ప్రకటించారు. దసరా ఉత్సవాలకు కూడా ఉచిత విద్యుత్ అందస్తామన్నారు. ”ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో చర్చించాను. వారు అంగీకరించారు.
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది. దసరా పందిళ్లకూ ఉచిత విద్యుత్ ఇస్తాం’ అని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకు పైగా వినాయక ఉత్సవ మండపాలకు ఉచిత కరెంట్ అందిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒంగోలులో విలేకరులకు చెప్పారు. వినాయక చవితి, దసరా ఉత్సవాలకు ఉచిత విద్యుత్ కోసం రూ.25 కోట్లు కేటాయించామని తెలిపారు. కాగా, వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు.
































