ఫ్లిప్‌కార్ట్‌లో 2.2 లక్షల సీజనల్‌ ఉద్యోగాలు

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సరఫరా, లాజిస్టిక్స్‌, డెలివరీ విభాగాల్లో 2.2 లక్షల సీజనల్‌ ఉద్యోగాలను సృష్టించింది.


ఇది కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కేవలం పండగల కోసం ఏర్పాటు చేసిన డెలివరీ కేంద్రాల్లో మరో 650 ఉద్యోగాశాలు అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీలో మహిళా నియామకాలు 10 శాతం పెరగనున్నట్టు వెల్లడించింది. అలాగే దివ్యాంగులకు కూడా ఈ పండగ సీజన్‌లో మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.