గుడ్‌ న్యూస్‌.. త్వరలో భారత్‌లో ఓపెన్‌ ఏఐ తొలి ఆఫీస్‌

ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తన తొలి ఆఫీస్‌ను ఓపెన్‌ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఏడాది చివరికల్లా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో చాట్‌ జీపీటీ వినియోగం గణనీయంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టినట్లు తెలిపాయి. మరోవైపు, భారత్‌లో ఏఐకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఓపెన్‌ ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మాన్‌ అన్నారు. భారత్‌లో తొలి ఆఫీస్‌ను ప్రారంభించి స్థానిక టీమ్‌ను ఏర్పాటు చేయడం, ఆ మిషిన్‌కు కట్టుబడి భారత్‌లో కృత్రిమ మేధను మరింత అందుబాటులోకి తెస్తామన్న నిబద్ధతకు ఇది తొలి మొట్టు అని ఆయన చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి భారత్‌లో ఓపెన్‌ ఏఐ ఆడుగుపెడుతుండటం పట్ల టెక్‌ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.