వారెవ్వా.. సిగ్నల్ లేకున్నా కాల్స్.. అద్భుత ఫీచర్ తీసుకొస్తున్న గూగుల్.. ఇకపై నో టెన్షన్..

మన స్మార్ట్‌ఫోన్‌లో సిగ్నల్ లేకపోతే.. మన దగ్గర ఫోన్ ఉన్నా లేకపోయినా ఒకటే. ఎందుకంటే ఫోన్‌లో నెట్‌వర్క్ లేకపోతే, మనకు ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. మనం ఇంటర్నెట్‌ను ఉపయోగించలేము. మనం ఎలాంటి కాల్స్ చేయలేము. ఈ సమస్యకు చెక్ పెడుతూ గూగుల్ సరికొత్త ఫీచర్ తీసుకొస్తుంది

చాలా సందర్భలాల్లో సరైన నెట్‌వర్క్ లేక యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడతారు. కనీసం కాల్స్ కూడా చేసుకోలేకపోతారు. ఇటువంటి సమయంలో నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా కాల్స్ వెళ్తే ఎంతో బాగుంటుంది కదా.. ఎప్పటి నుంచో ఈ చర్చ నడుస్తోంది. ఇప్పుడు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ అదే పనిలో పడింది. దీని వల్ల సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా వాట్సాప్ ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అవును సిగ్నల్స్ లేకుండా కూడా కాల్స్ చేసుకోవచ్చని గూగుల్ చెబుతోంది. దీన్ని కోసం.. గూగుల్ ఇటీవల గూగుల్ పిక్సెల్ 10 సిరీస్‌లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.


ఇది సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా వాట్సాప్ ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి అనుమతిస్తుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఈ సౌకర్యం సాధ్యమవుతుంది., ఈ ఫీచర్‌తో వచ్చే మొదటి ఫోన్ పిక్సెల్ 10 అని గూగుల్ తెలిపింది. ఈ నెల 20న జరిగిన ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో పిక్సెల్ 10 సిరీస్‌ను ఆవిష్కరించిన గూగుల్, ఈ ఫోన్‌కు ఈ కొత్త ఫీచర్‌ను జోడిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఆగస్టు 28 నుండి అందుబాటులోకి వచ్చే గూగుల్ పిక్సెల్ 10 ఫోన్‌లతో పాటు ఈ శాటిలైట్ కాలింగ్ ఫీచర్ కూడా అదే రోజు విడుదల చేయనున్నట్లు గూగుల్ తెలిపింది.

గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ వినియోగదారులు సిగ్నల్ లేదా వైఫై కవరేజ్ లేని ప్రాంతంలో ఉన్నప్పుడు ఫోన్ స్టేటస్ బార్‌లో శాటిలైట్ ఐకాన్ కనిపిస్తుంది. అప్పుడు, మనం వాట్సాప్ నుండి ఎవరికైనా ఆడియో లేదా వీడియో కాల్ చేసినప్పుడు, అది శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా కనెక్ట్ అవుతుంది. దాని ద్వారా, మనం వీడియో, ఆడియో కాల్స్ చేయవచ్చు. ఈ ప్రక్రియ మన సాధారణ కాల్స్ చేయడం లాంటిదేనని గూగుల్ విడుదల చేసిన టీజర్‌లో తెలిపింది.

ప్రపంచంలోనే ఫస్ట్ ఫోన్

ఈ సాంకేతికత విజయవంతమైతే, వాట్సాప్ ద్వారా శాటిలైట్ కాలింగ్‌ను అందించే ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 10 అవుతుంది. అయితే ఈ సేవలు ఎంపిక చేసిన టెలికాం ఆపరేటర్లతో మాత్రమే పనిచేస్తాయని తెలిసింది. ఈ ఫీచర్‌ను పొందడానికి అదనపు ఛార్జీలు విధించే అవకాశం ఉంది.

గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ధర:

గూగుల్ పిక్సెల్ 10 ధర రూ. 79,999. ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ కోసం 256GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. గూగుల్ పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL కూడా ఒకే స్టోరేజ్ ఆప్షన్‌లో లాంచ్ అయ్యాయి. 16జీబీ ర్యామ్ + 256GB. పిక్సెల్ 10 ప్రో ధర రూ. 1,09,999. అదే సమయంలో, పిక్సెల్ 10 ప్రో XL ధర రూ. 1,24,999. ఈ రెండు ఫోన్‌లు గూగుల్ నుంచి ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.