ఈ కొత్త శాంసంగ్ 5G ఫోన్ క్రేజే వేరబ్బా.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతో తెలిస్తే ఎగబడి కొనేస్తారంతే

 కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 5Gపై భారీ డిస్కౌంట్ (Samsung Galaxy A55 5G) అందిస్తోంది.


ఏకంగా రూ.13వేలు ధర తగ్గింది. మీరు అప్‌గ్రేడ్ కోసం చూస్తుంటే.. ప్రీమియం-ఫీలింగ్ స్మార్ట్‌ఫోన్‌ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఇలాంటి డీల్స్ మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండవు. ఆఫర్ ముగిసేలోగా ఇప్పుడే ఈ శాంసంగ్ 5G ఫోన్ కొనేసుకోండి.

శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫ్లిప్‌కార్ట్ డీల్ :

శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ (8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్) భారత మార్కెట్లో రూ.39,999కు లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.26,699కు లిస్ట్ అయింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ గెలాక్సీ A55 5G ఫోన్‌పై రూ.13,300 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ A55 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. హుడ్ కింద ఈ శాంసంగ్ ఫోన్ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఇంకా, శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా శాంసంగ్ గెలాక్సీ A55 5G హ్యాండ్‌సెట్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం గెలాక్సీ A55 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.

ఇతర ఫీచర్లు వివరాలివే :

  • నానో-సిమ్
  • నానో-సిమ్ + eSIM
  • నానో-సిమ్ + నానో-సిమ్
  • నానో-సిమ్ + నానో-సిమ్ + eSIM (2)
  • IP67 డస్ట్/వాటర్ నిరోధకత (30 నిమిషాలకు వరకు)
  • డిస్‌ప్లే : సూపర్ అమోల్డ్, 120Hz, HDR10+, 1000 నిట్స్ (HBM)
  • సైజు : 6.6 అంగుళాలు, 106.9 సెం.మీ 2 (85.8శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో)
  • రెజుల్యుషన్ : 1080 x 2340 పిక్సెల్స్, 19.5:9 రేషియో (390 ppi డెన్షిటీ)
  • ప్రొటెక్షన్ : కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+
  • OS : ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 14, 4 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, వన్ UI 6.1
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.