అల్పపీడనం ఎఫెక్ట్.. మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.


ఈ అల్పపీడన ప్రభావం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి వెళ్లి మరింత బలపడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు అధికారులు జారీ చేశారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని ప్రజలను అధికారులు సూచించారు.

ఏపీలో ఈ జిల్లాల్లో..

ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, మన్యం, కాకినాడ, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడపలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల వారు ఎక్కువగా వేటకు వెళ్తుంటారని వేటకు వెళ్లవద్దని సూచించారు.

తెలంగాణలో ఈ జిల్లాల్లో..

తెలంగాణలో ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాగో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విధించింది. అలాగే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హన్మకొండ, జనగాం మెదక్, మహబూబ్‌నగర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ప్రాంతాల ప్రజలు బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. అలాగే కరెంట్ వైర్లు, విద్యుత్ స్తంభాలకు కాస్త దూరంగా ఉండాలని తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.