వన్​ప్లస్ నుంచి కొత్త ఇయర్​బడ్స్- పోగొట్టుకున్నా కనిపెట్టేయొచ్చట

కొత్త ఇయర్​బడ్స్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. భారత మార్కెట్​లోకి వన్​ప్లస్​ నుంచి కొత్త ట్రూలీ వైర్‌లెస్ స్టీరియో (TWS) హెడ్‌సెట్ వచ్చింది. దీని పేరు “వన్​ప్లస్ నార్డ్ బడ్స్ 3r”. ఈ ఇయర్‌ఫోన్‌లు డస్ట్, వాటర్ రెసిస్టెన్సీ కోసం IP55 రేటింగ్​ను కలిగి ఉన్నాయి. దీంతోపాటు 12.4mm టైటానియం డైనమిక్ డ్రైవర్లతో వస్తాయి.


ఈ ఇయర్​బడ్స్​ AI- ఆధారిత కాల్ నాయిస్ క్యాన్సిలేషన్, డ్యూయల్-డివైస్ కనెక్టివిటీ, రియల్-టైమ్ AI ట్రాన్స్‌లేషన్, 360-డిగ్రీ వన్​ప్లస్ 3D ఆడియో వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. అదనంగా వీటిలో “ఫైండ్ మై ఇయర్‌బడ్స్” ఫీచర్ కూడా ఉంది. ఇది పోగొట్టుకున్న ఇయర్‌బడ్‌లను సులభంగా కనుగొనడానికి వీలు కల్పిస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇవి 54 గంటల వరకు బ్యాటరీ లైఫ్​ను ఇస్తుంది.

వన్​ప్లస్ నార్డ్ బడ్స్ 3r కలర్ ఆప్షన్స్: ఈ ఇయర్‌ఫోన్‌లు రెండు కలర్ ఆప్షన్​లలో లభిస్తాయి.

  • ఆరా బ్లూ
  • యాష్ బ్లాక్
  • వన్​ప్లస్ నార్డ్ బడ్స్ 3r ధర ఎంతంటే?: భారతదేశంలో “వన్​ప్లస్ నార్డ్ బడ్స్ 3r” ధర రూ. 1,799. కానీ లాంఛ్ ఆఫర్​లో భాగంగా కంపెనీ దీన్ని కొన్ని రోజుల వరకు రూ. 1,599లకే అందించనుంది.

    వన్​ప్లస్ నార్డ్ బడ్స్ 3r సేల్ వివరాలు: ఇవి సెప్టెంబర్ 8 నుంచి వన్​ప్లస్ ఇండియా ఇ-స్టోర్, వన్​ప్లస్ స్టోర్ యాప్, వన్​ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, Amazon, Flipkart, Myntra, Croma, Reliance, Vijay Sales, Bajaj Electronicsతో పాటు ఇతర ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.

    వన్​ప్లస్ నార్డ్ బడ్స్ 3r ఫీచర్లు, స్పెసిఫికేషన్లు: ఇవి 12.4mm టైటానియం-కోటెడ్ డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి. ఇవి సుపీరియర్ సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. వినియోగదారులకు మూడు ప్రీసెట్ EQ మోడ్‌లు లభిస్తాయి. సౌండ్ మాస్టర్ EQ ఫీచర్ ద్వారా సిక్స్-బ్యాండ్ ఈక్వలైజర్‌తో వారి అనుభవాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. వన్‌ప్లస్ 3D ఆడియో 360-డిగ్రీల సౌండ్ ఎక్స్​పీరియన్స్​ను అందిస్తుంది.

    దీనిలోని డ్యూయల్ మైక్‌లు, AI టెక్నాలజీ కారణంగా కాల్స్ మరింత స్పష్టంగా వినిపిస్తాయి. బ్లూటూత్ 5.4, గూగుల్ ఫాస్ట్ పెయిర్‌తో ఇది డ్యూయల్-డివైస్ కనెక్టివిటీ, 47ms లో-లేటెన్సీ గేమింగ్ మోడ్‌ను కలిగి ఉంది. ఇందులోని “ట్యాప్ 2 టేక్” ఫీచర్​ను డబుల్-ట్యాప్ చేయడం ద్వారా ఫొటోలను తీయొచ్చు. దీని “ఫైండ్ మై ఇయర్‌బడ్స్” ఫీచర్ కోల్పోయిన బడ్స్​ను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. దీని ఛార్జింగ్ కేస్ 54 గంటల బ్యాటరీ లైఫ్, TÜV రైన్‌ల్యాండ్ బ్యాటరీ హెల్త్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. వీటిలో ఒక్కో ఇయర్​ఫోన్ డస్ట్, వాటర్ నుంచి రక్షించేందుకు IP55 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.