డిమార్ట్ షాపింగ్ లో కొన్ని చిట్కాలు పాటిస్తే మరింత చవకగా వస్తువులు.

డిమార్ట్ షాపింగ్ లో కొన్ని చిట్కాలు పాటిస్తే మరింత చవకగా వస్తువులు.. డిమార్ట్‌లో సరుకులు కొనడం వల్ల గణనీయమైన ఆదా జరుగుతుంది. అందుకే చాలామంది నెలవారీ సరుకులను ఒకేసారి డిమార్ట్ నుంచి తెచ్చుకుంటారు.


అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే మరింత చవకగా కొనుగోలు చేయవచ్చు. ఈ చిట్కాలు ఇలా ఉన్నాయి:

సరైన రోజుల్లో షాపింగ్ చేయండి
డిమార్ట్‌కు వెళ్లాలనుకునేవారు వారాంతాలు (శని, ఆదివారాలు) ఎంచుకోకండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు వెళితే రద్దీ తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఏ వస్తువులపై ఎక్కువ రాయితీ ఉందో సులభంగా గుర్తించవచ్చు. సాధారణ రోజుల్లో కొన్ని ఉత్పత్తులపై రాయితీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే, డిమార్ట్ లేబుల్ ఉన్న బ్రాండ్ వస్తువులను కొంటే మరింత తక్కువ ధరకు లభిస్తాయి.

బల్క్‌గా కొనండి, ఆదా చేయండి
డిమార్ట్‌లో మంచి నాణ్యత ఉన్న వస్తువులు తక్కువ ధరకు దొరుకుతాయి. సబ్బులు, డిటర్జెంట్లు వంటి వస్తువులను చిన్న మొత్తంలో కొనకుండా, ఎక్కువ మొత్తంలో కొనడం వల్ల అదనపు ఆదా సాధ్యమవుతుంది. కొన్ని ఉత్పత్తులు ఎక్స్‌పైరీ తేదీకి దగ్గరగా ఉంటే, వాటిపై 30% నుంచి 50% వరకు రాయితీ లభిస్తుంది. ఆ వస్తువులను ఎక్స్‌పైరీ డేట్‌కు ముందు వాడగలిగితే, వాటిని కొనడం ద్వారా గణనీయంగా ఆదా చేయవచ్చు.

సీజన్‌కు తగ్గట్టు కొనండి
పండగల సీజన్‌లో, ముఖ్యంగా దీపావళి, దసరా, సంక్రాంతి సమయాల్లో డిమార్ట్‌లో భారీ తగ్గింపులు ఉంటాయి. అలాగే, వేసవి, వర్షాకాలం, శీతాకాలం వంటి సీజన్లలో కూడా సందర్భానికి తగ్గట్టు ఆఫర్లు ఉంటాయి. ఈ రాయితీలు వారానికి ఒకసారి మారుతుంటాయి. కాబట్టి, ఈ ఆఫర్లపై అవగాహన పెంచుకొని, సరైన సమయంలో షాపింగ్ చేస్తే మరింత డబ్బు ఆదా చేయవచ్చు.

ఆన్‌లైన్‌తో పోల్చండి
డిమార్ట్ ఆన్‌లైన్‌లో కొన్ని వస్తువులు ఖరీదుగా ఉండి, స్టోర్‌లో తక్కువ ధరకు లభిస్తాయి. కాబట్టి, ఆన్‌లైన్ ధరలతో స్టోర్ ధరలను పోల్చి చూడండి. డిమార్ట్‌కు చెందిన వస్తువులపై ‘D’ కోడ్ ఉంటే, అవి డిమార్ట్ బ్రాండ్ ఉత్పత్తులు. వీటిపై రాయితీలు ఎక్కువగా ఉంటాయి. ఈ వస్తువుల గురించి తెలుసుకొని కొనుగోలు చేస్తే ఆదా అవకాశం పెరుగుతుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.