DMart తో కలిసి వ్యాపారం…నెలకు లక్షల రూపాయలు సంపాదించే సువర్ణావకాశం

DMart పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది తక్కువ ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులు. ఆన్లైన్ కిరాణా దెబ్బకు మిగతా సూపర్ మార్కెట్ లో చేతులెత్తేస్తుంటే డీ మార్ట్ మాత్రం ఈ బిజినెస్ మోడల్ తోనే దూసుకెళ్లిపోతుంది.


దాదాపు 70 నగరాల్లో తమ షాపులు నిర్వహిస్తున్న డీ మార్ట్ తో కలిసి వ్యాపారం చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా? ఆ అవకాశం కలిపిస్తుంది డీ మార్ట్. వారితో భాగస్వాములుగా మారి నెలకు లక్షల రూపాయలు సంపాదించే అవకాశం కలిగిస్తుంది. వివరాలకోసం…

నిజానికి డీ మార్ట్ ద్వారా ఎవరైనా తమ సరుకులను అమ్ముకోవచ్చు. ఉదాహరణకు మీది స్వీట్ ల తయారీ వ్యాపారమైతే మీరు ఆ స్వీట్ లను మీ బ్రాండ్ నేమ్ తో DMart షాపులలో అమ్మవచ్చు. లేదా మీది స్టీలు గిన్నెలు చేసే చిన్న ఫ్యాక్టరీ అనుకోండి మీ సరుకుని వారి షాపుల్లో అమ్మవచ్చు. ఇలా మీరు ఉత్పత్తి దారుడు, లేదా కిరాణా వ్యాపారి ఏదైనా కానీ మీ దగ్గరున్న సరుకు డీ మార్ట్ వేదికగా అమ్ముకుని లాభం చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం ఏమి చెయ్యాలో తెలుసుకుందాం…

డీ మార్ట్ వ్యాపారభాగస్వాములు కావాలంటే ఏమి చెయ్యాలో స్టెప్ బై స్టెప్ మీ కోసం…

ముందుగా మీరు డీ మార్ట్ వెబ్సైటు ను ఓపెన్ చేయండి.అందులో ‘Partner With Us’ సెక్షన్ ఓపెన్ చేయండి. మీ పేరు, మొబైల్ నంబర్, ప్రొడక్ట్ వివరాలు నింపి సబ్మిట్ చేయండి. అంతే సింపుల్. డీమార్ట్ టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. సాధారణంగా ప్రతీ మంగళవారం రోజున మీటింగ్ షెడ్యూల్ చేసి ధరలు, మార్జిన్స్, షరతులపై చర్చిస్తారు.

మీ ప్రోడక్ట్ అలాగే క్వాలిటీ వారికి నచ్చినట్టయితే వారి షాప్ లో అమ్మటానికి మీతో అగ్రిమెంట్ చేసుకుంటారు. తరువాత మీరు డీ మార్ట్ షాపుల్లో మీ ప్రోడక్ట్ ను డిస్ ప్లే లో పెడతారు. కస్టమర్ల మీ ప్రోడక్ట్ చేరువవుతుంది. అమ్మకాలపై వచ్చే ప్రాఫిట్ లో వారి లాభం మినహాయించుకుని మీది మీకు ఇస్తారు. అయితే DMart బిజినెస్ మోడల్ అంటే లో (Low ) మార్జిన్ కదా… మాకేమి మిగులుతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే లో మార్జిన్ లో హై ప్రాఫిట్ తీసుకోవడం వీరి విధానం. అదెలా అంటే పెద్ద మొత్తంలో సేల్స్ చేయటం ద్వారా..అదెలా అంటారా?

నిజానికి వీరు తమ సప్లయర్ల మధ్య పోటీపెట్టి తక్కువ ధరకు సరుకు కొంటారు. అది మార్కెట్ లో పోటీ ధరకు అమ్ముతారు దాంతో సేల్స్ విపరీతంగా ఉంటాయి. ఇది ఫైనల్ గా విపరీతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. సో మీరు డీ మార్ట్ కు పోటీ ధరకు అమ్ముతారు, వారు కస్టమర్ కు మీ ఉత్పత్తి పోటీ ధరకు ఇస్తారు…చివరికి అది మీకు ఎక్కువ లాభాలు తెచ్చి పెడుతుంది. ఇంట్రస్టింగ్ కదా. ఇంకెందుకు ఆలస్యం వెంటనే రిజిస్టర్ అయిపోండి.

ఇదే కాకుండా DMart నుండి మరోలా కూడా డబ్బు సంపాదించే అవకాశముంది. అదెలా అంటే మీ దగ్గర లీజ్‌కి లేదా అమ్మకానికి ప్రాపర్టీ ఉంటే వాటిని కొనడానికి లేదా లీజు కు తీసుకోవడానికి డీ మార్ట్ సిద్ధంగా ఉంది. ఇలా కొన్న వాటిని తమ సరుకులు నిల్వ ఉంచే గిడ్డంగులకింద వాడుకుంటుంది. 2000 సంవత్సరం నుండి వీరు తమ నెట్ వర్క్ ను పెంచుకునే వ్యూహంలో లో భాగంగా ఆస్తులను కొంటున్నారు. ఒక వేళ మీరు ఇల్లు లేదా స్థలం అమ్మాలనుకున్నా లేదా లీజుకివ్వాలనుకున్నా వారి వెబ్ సైట్ ద్వారా కాంటాక్ట్ చెయ్యవచు…

Disclaimer: ఈ ఆర్టికల్ కేవలం పాఠకుల అవగాహకోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఇన్వెస్ట్మెంట్ సలహా కాదు అని గమనించగలరు. ఏదైనా పెట్ట్టుబడులు పెట్టేటప్పుడు ఆర్థిక నిపుణుల సలహాలను తీసుకోండి. 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.