పుట్టినరోజు కేక్ కట్ చేయడమనేది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? మొదటి కేక్ కోసింది ఎవరంటే

చిన్నవారైనా.. పెద్దవారైనా.. దాదాపు అందరూ తమ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరుకుంటారు. కానీ ఈ ట్రెడీషన్ ఎప్పుడు మొదలైంది? అసలు మొదట కేక్ కట్ చేసి పుట్టినరోజును ఎవరు జరుపుకున్నారో అని ఎప్పుడైనా ఆలోచించారా?


పుట్టినరోజున కొవ్వొత్తులు వెలిగించి.. ఆర్పే ఆచారం పురాతన గ్రీస్.. అంటే గ్రీకు నుంచి వచ్చింది.

అప్పట్లో వెలుగుతున్న కొవ్వొత్తులను తీసుకుని గ్రీక్ దేవుడు దగ్గరకు వెళ్లి.. వాటితో గ్రీక్ దేవుని గుర్తును తయారు చేసేవారు.

అనంతరం కొవ్వొత్తులను ఆర్పివేసేవారు. తద్వారా వాటి పొగ చుట్టూ వ్యాపిస్తుంది. కొవ్వొత్తి ఆర్పినప్పుడు వచ్చే పొగ పైకి వెళ్లి కోరికను భగవంతుడికి చేరవేస్తుందని నమ్మేవారు.

పుట్టినరోజున కేక్ కట్ చేసి.. కొవ్వొత్తులు ఆర్పే సంప్రదాయం మధ్యయుగపు జర్మనీలో ప్రారంభమైంది. 1746లో మొదటిసారిగా కేక్ మీద కొవ్వొత్తులు పెట్టి పుట్టినరోజు జరుపుకున్నారు.

మతపరమైన, సామాజిక సంస్కర్త జింజెన్‌డార్ఫ్ ది పుట్టినరోజున ఈ సెలబ్రేషన్స్ చేశారు. ఆ రోజుల్లో జర్మనీలో పిల్లల పుట్టినరోజున ఒక ప్రత్యేక వేడుక జరిగేది.

అప్పుడు కేక్ మీద కొవ్వొత్తులు వెలిగించి వాటిని అలాగే ఉంచేవారు. అవి రోజంతా వెలుగుతూనే ఉండేవి. సాయంత్రం కోరిక కోరుకుని ఆర్పేవారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.