రోజూ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తే కలిగే శుభఫలితాలేంటీ?

బ్రాహ్మీ ముహూర్తంలో వీర వాయువు అని ఒక ప్రత్యేక వాయువు వీస్తుంది. ఆ ముహూర్తంలో నిద్ర లేస్తే ఈ వాయువు ప్రభావంతో అద్భుత ఫలితాలుంటాయి. అనారోగ్యాలు తొలగుతాయి. సూర్యోదయానికి ముందు రెండు ముహూర్తాల కాలం వద్ద బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభమవుతుంది. ఒక ముహూర్త కాలం అంటే 48 నిమిషాలు. రెండు ముహూర్త కాలాలంటే 96 నిమిషాలు. అంటే సూర్యోదయానికి ముందు గంటా 36 నిమిషాల వద్ద బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభమై అది 48 నిమిషాల పాటు ఉంటుంది. ఈ ముహూర్తంలో దేవతలంతా తమ శక్తులను భూమ్మీదకు ప్రసరింపజేస్తుంటారు. ఈ ప్రభావంతో  బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచినా, పూజలు చేసినా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ధ్యానం చేసినా ఉత్తమ ఫలితం కలుగుతుంది. ఎవరైనా గృహ ప్రవేశం చేసుకోవాలంటే ఈ ముహూర్తంలో చేస్తే ఇంకా ఎలాంటి ముహూర్తాలు అవసరంలేదు. బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకుంటే మంచిది. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగానూ ఉత్తమ ఫలితాలుంటాయి.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.