తెలుగు సినీ ప్రముఖ కుటుంబంలో విషాదం నెలకొంది. కీర్తిశేషులు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం శుక్రవారం రాత్రి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, అర్థరాత్రి 1.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. కనకరత్నం మరణ వార్త తెలిసి సినీ పరిశ్రమతో పాటు అభిమానులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు కోకాపేటలో జరగనున్నాయి.
కీర్తిశేషులు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె శుక్రవారం అర్థరాత్రి 1.45 గంటల సమయంలో స్వర్గస్తులయ్యారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలియగానే ముంబయిలో షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ , మైసూరులో ఉన్న రాంచరణ్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం తర్వాల కోకాపేటలో నిర్వహించనున్నారు.
వయోభారంతో కొంతకాలంగా బాధపడుతోన్న కనకరత్నం మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు ఆమెని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పట్లో ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కొద్దిరోజుల తర్వాత ఆమె కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు ముగ్గురు సంతానం కాగా వారిలో కుమారుడు అల్లు అరవింద్, కుమార్తె సురేఖ సినీ అభిమానులకు సుపరిచితమే. వారి పిల్లలు అల్లు అర్జున్, రామ్ చరణ్, శిరీష్, బాబీ, సుష్మిత కొణిదెల ఆ కుటుంబాల వారసత్వాన్న కొనసాగిస్తూ సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. రామలింగయ్య 2004లో మరణించిన తర్వాత కనకరత్నం బయట పెద్దగా కనిపించలేదు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో మాత్రమే ఆమె కనిపించింది.
































