విద్యార్థులకు అలర్ట్ – ఇంటర్ అడ్మిషన్లకు దగ్గరపడిన గడువు, ఇదే ఫైనల్ ఛాన్స్

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు రేపటితో(ఆగస్ట్ 31) పూర్తవుతుంది. కాబట్టి టెన్త్ పాస్ అయిన విద్యార్థులు… వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రాష్ట్రంలో అన్ని రకాల జూనియర్‌ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు దగ్గరపడింది. అర్హులైన విద్యార్థులు… అడ్మిషన్ తీసుకునేందుకు రేపటి (ఆగస్ట్ 31) వరకు గడువు ఉంది. కాబట్టి విద్యార్థులు వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హులైన టెన్త్ విద్యార్థులు… వెంటనే అడ్మిషన్లు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే ఫైనల్ ఛాన్స్ అని… ఆ తర్వాత గడువును మళ్లీ పెంచే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు గడువు కూడా పెంచిన సంగతి తెలిసిందే.

ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయంతో… రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్, మోడల్, ఇతర జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆగస్టు 31 లోగా ప్రవేశ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరానికి సంంబధించిన తొలి విడత ప్రవేశాలు మే 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ గడువు జూన్ 30వ తేదీతో ముగిసింది. ఆ తర్వాత నుంచి రెండో విడత ప్రవేశాలను చేపట్టింది. ఈ గడువు ఆగస్ట్ 31వతో ముగిసిపోనుంది.

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఇంటర్ ఫస్ట్ ఇయర్) తరగతులు జూన్ 2, 2025 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రెగ్యూలర్ విద్యార్థులతో పాటు మరికొంత మంది విద్యార్థులు… డిప్లోమా వంటి పలు కోర్సుల్లో చేరుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా కోర్సుల్లో సీటు రానివారు లేదా ఇతర కారణాలతో… జూనియర్ కాలేజీల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గడువును పెంచారు. కానీ రేపటితో పూర్తి అయితే…మరోసారి పొడిగించే అవకాశం లేదు.

మరోవైపు ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను కూడా బోర్డు అధికారిక వెబ్ సైట్ టీఎస్‌బీఐఈ (https://tgbie.cgg.gov.in/ ) లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంటున్నారు. ఇక విద్యార్థుల ఆధార్‌ నెంబర్‌ తప్పకుండా నమోదు చేయటంతో పాటు… అడ్మిషన్ల వివరాలను ప్రతీ రోజూ కాలేజీ బోర్డుపై ఉంచాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.