హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ప్రారంభం కానుంది. భూదాన్ పోచంపల్లిలోని ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నామని మండల విద్యాధికారి ప్రభాకర్ అన్నారు.
శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హెడ్ కుక్ పోస్టుకు 10వ తరగతి, అసిస్టెంట్ కుక్ పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. అర్హత గల వయసు 18 నుండి 45 సంవత్సరాలు మధ్య ఉండాలని తెలిపారు. ఇట్టి దరఖాస్తులను సెప్టెంబర్ 5 లోగా కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలలోని ప్రిన్సిపల్ ఇందిరాకు సమర్పించాలని సూచించారు. ఈ హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు.
































