ఒక్క రూపాయి వడ్డీ లేకుండా.. తక్షణమే రూ.20 వేలు.. ఎలాగో వెంటనే తెలుసుకోండి..

 ప్రస్తుత కాలంలో డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే. ఎప్పుడు ఏరకంగా డబ్బు అవసరం పడుతుందో చెప్పలేం. అందుకే చేతిలో కచ్చితంగా ఎంతోకొంత డబ్బు ఉండాలని కొందరు చెబుతుంటారు.


కానీ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ఇటీవల చాలామంది చేతుల్లో అవసరానికి డబ్బు ఉండడం లేదు. దీంతో ఏదైనా అత్యవసరం ఏర్పడినప్పుడు ఇతరుల వద్ద అప్పు తీసుకుంటున్నారు. కొందరు బ్యాంకు రుణం కూడా తీసుకుంటున్నారు. అయితే వీటికి అదనంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఎలాంటి వడ్డీ లేకుండా కొంత డబ్బు ఇవ్వాలంటే ఈ రోజుల్లో ఎవ్వరు సాహసం చేయడం లేదు. కానీ ఫోన్ పే మాత్రం ఎలాంటి వడ్డీ లేకుండా కొన్ని రోజులపాటు డబ్బును అప్పుగా ఇస్తుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి.

అత్యవసరంగా రూ.10,000 అవసరం ఉంటుంది. కానీ ఎవరినైనా అడగాలంటే ఆత్మ అభిమానం అడ్డు వస్తుంది. పోనీ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకోవాలని అనుకుంటే.. వడ్డీ ఎక్కువ అవుతుంది. ఇలాంటి సమయంలో ఫోన్ పే ఒక చక్కటి అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తుంది. 45 రోజుల పాటు ఎలాంటి వడ్డీ లేకుండా అత్యవసరంగా రూ. 10 నుంచి 20 వేలు అందిస్తుంది. అయితే వీటిని గడువు తేదీలోగా చెల్లించాలి. లేకపోతే వడ్డీ విధించే అవకాశం ఉంటుంది. మరి ఈ డబ్బులు ఎలా పొందాలి? దానికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది?

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్ పే వాడుతూ ఉంటారు. కానీ ఇందులో ఎన్నో రకాల ప్రయోజనాల ఆప్షన్లు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు. వీటిలో Credit card లైన్ అనే ఆప్షన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఫోన్ పే లోని లెఫ్ట్ సైడ్ టాప్ లో సెల్ఫ్ అకౌంట్ పై ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ అకౌంటు ఓపెన్ అవుతుంది. ఇందులో మేనేజ్ పేమెంట్ పై ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన పేజీని కిందికి స్క్రోల్ చేయాలి. ఇక్కడే క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై ప్రెస్ చేయగానే.. కొన్ని బ్యాంకుల పేర్లు కనిపిస్తాయి. అందులో మీ బ్యాంకు ఉన్నట్లయితే దానిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ బ్యాంకును క్రెడిట్ లైన్ ఆప్షన్కు లింకు చేసుకోవచ్చు. ఇలా లింకు చేసుకున్న తర్వాత ఫోన్ పే నుంచి కావాల్సిన డబ్బులను బ్యాంకు అకౌంట్ లో వేసుకోవచ్చు. ఈ విధంగా అత్యవసర సమయాల్లో డప్పును వాడుకొని.. నిర్ణీత సమయంలో చెల్లించుకోవచ్చు. అయితే ఇలా డబ్బు అందుబాటులో ఉంది కదా అని.. ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెడితే.. ఆ తర్వాత బిల్లును కట్టలేక అవస్థలు పడతారు. అందువల్ల అత్యవసరం ఉంటే మాత్రమే దీనిని వాడుకోవాలి. లేకుంటే కష్టాల పాలవుతారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.