పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తారా? ఇదే ఛాన్స్.. కొత్త బంకులకు జియో-బీపీ నోటిఫికేషన్

కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తే నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగుతాయి సంవత్సరం పొడవునా గిరాకీ ఉంటుంది. అలాంటి వ్యాపారాల్లో పెట్రోల్ పంప్ ఒకటని చెప్పవచ్చు.


మంచి లొకేషన్‌లో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేసినట్లయితే 24 గంటలు గిరాకీ ఉంటుంది. మంచి లాభాలు అందుకోవచ్చు. దీంతో చాలా మంది పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని అనుకుంటారు. కానీ, ప్రాసెస్ తెలియగా వెనకడుగు వేస్తుంటారు. ఈ బిజినెస్‌లో ఒకసారి పెట్టుబడి పెట్టినట్లయితే ఆ తర్వాత ప్రతి ఏటా ఆదాయం వస్తూనే ఉంటుంది. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కొంత అనుభవం సైతం ఉండాలి. అన్ని అర్హతలు ఉంటే పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం చాలా సులభమే అని చెప్పవచ్చు.

మీరు సైతం పెట్రోల్ బంక్ పెట్టాలని అనుకుంటుంటే మీకో బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ప్రైవేట్ చమురు రిటైలింగ్ కంపెనీ రిలయన్స్ జియో- బీపీ సంస్థ కొత్త బంకులు ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. మున్సిపల్ పరిధి, సహా గ్రామీ ప్రాంతాల్లోనూ ఈ బంకులు ఏర్పాటు చేసే అవకాశం ఇస్తోంది. జియో- బీపీ పెట్రోల్ బంకు ఏర్పాటు చేయాలనుకునే వారు అక్టోబర్ 31, 2025 వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశాన్ని ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాల్లో అవగాహన కల్పిస్తోంది. పూర్తి వివరాలకు జియో బీపీ అధికారిక వెబ్‌సైట్ Jiobp.inలోకి వెళ్లి తెలుసుకోవడంతో పాటు partners.jiobp.in పేజీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

జియో బీపీ మొబిలిటీ స్టేషన్ (Petrol Pump) డీలర్‌షిప్ కోసం ప్రత్యేక బ్రోచర్ విడుదల చేసింది జియో బీపీ సంస్థ. నేషనల్, స్టేట్ హైవేల పక్కన లేదా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే దారుల పక్కన భూమి కలిగి ఉండి పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డీలర్ ఓన్డ్ డీలర్ ఆపరేటెడ్ (DODO) ప్రాతిపదికన ఈ రిటైల్ ఔట్‌లెట్లు ఏర్పాటు చేస్తోంది. దరఖాస్తు చేసుకునే సంస్థ యాజమాన్య సంస్థ అయితే యజమాని ఫారమ్ నింపాల్సి ఉంటుంది. భాగస్వామ్య సంస్థ అయితే ప్రతి భాగస్వామి ప్రత్యేక ఫారమ్ నింపాలి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే, ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఎంటిటీగా నింపాల్సిన ఫారమ్. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనే సంస్థతో నింపాల్సిన ఫారమ్.

అలాగే సీఏ ద్వారా తాజా నెట్‌వర్త్ స్టేట్మెంట్ లెటర్ తీసుకురావాలి. కేవైసీ డాక్యుమెంట్లు పాన్, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. అఫిడవిట్ ఉండాలి. ల్యాండ్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీతో సంబంధాలు ఉన్న వారు, దివ్యాగులు, ఏదైనా కేసులో నేరం రుజువైన వారు, ఎన్ఆర్ఐలకు అర్హత ఉండదు. నాన్-రిఫండబుల్ అమౌంట్ రూ.5000 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వెబ్‌సైట్లో జియో-బీపీ సంస్థ పేర్కొంది.

నేషనల్ హైవేల పక్కన అయితే 1225- 4422 చదరపు అడుగుల భూమి ఉండాలి. పెట్టుబడి రూ.151 లక్షల నుంచి రూ.280 లక్షల వరకు అవుతుంది. మెట్రోపాలిటన్ లేదా మున్సిపాలిటీ పరిధిలో అయితే 400- 2021 చదరపు అడుగుల భూమి ఉండాలి. రూ.1.16 కోట్ల నుంచి రూ.2.24 కోట్ల వరకు పెట్టుబడి ఉండాలి. ఇతర మండల్, రూరల్, అగ్రికల్చర్ రోడ్ల పక్కన అయితే 1200- 1600 చదరపు అడుగుల భూమి ఉండాలి. రూ.82 లక్షల నుంచి రూ.1.40 కోట్ల వరకు పెట్టుబడి అవసరమవుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.