ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, లెజెండరీ తమిళ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఘాటి.
చింతకింద శ్రీనివాస్ అందించిన కథను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ తదితరులు నటించారు.
యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫి, తూరుపు చాణక్య రెడ్డి, నాగవెళ్లి విద్యాసాగర్ సంగీతం అందించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీ 2025 తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్టు వివరాల్లోకి వెళితే..
అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్‌ను ఇటీవల దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రాన్ని ఇటీవల సెన్సార్ అధికారులు రివ్యూ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను వీక్షించిన అధికారులు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన కథను, అనుసరించిన కథనంపై ప్రత్యేకంగా అభినందించారు అని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు.
ఘాటీ సినిమా భావోద్వేగాలకు గురిచేసే కథతో రూపొందింది. రైల్వే స్టేషన్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్, అలాగే గుహలో ఫైట్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అంశాలుగా ఫస్టాఫ్‌లో కనిపిస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రేక్షకుడిని సీట్లకు అత్తుకుపోయేలా చేస్తుంది. శీలావతిగా అనుష్క పాత్రలోకి దూరిపోయిన విధానం సెకండాఫ్‌కు హైలెట్‌గా నిలుస్తుంది. ఎమోషనల్ అంశాలు, నటీనటులు, ముఖ్యంగా అనుష్క, చైతన్య రావు పవర్ హౌస్ పెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా మారే అవకాశం ఉంది అని చిత్ర యూనిట్, సెన్సార్ అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
భావోద్వేగంగా సాగే సన్నివేశాలకు బుర్రా సాయి మాధవ్, చింతకింది శ్రీనివాసరావు రాసిన మాటలు పవర్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా మాస్ ఎలిమెంట్స్‌ను రుచి చూపించేలా ఉంటాయి. మనోజ్ రెడ్డి కాటసాని అందించిన సన్నివేశాలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఈ సినిమాకు సాగర్ అందించిన బీజీఎం మరో రేంజ్‌లో ఉన్నాయి. ఈ రెండు అంశాలు సినిమాను సహజంగా మార్చాయి. ఓ విభిన్నమైన సినిమాను చూశామనే తృప్తిని అందిస్తాయి అని చిత్ర యూనిట్ సభ్యులు షేర్ చేసుకొన్నారు.
ఘాటీ సినిమాలోని స్టోరి, స్క్రీన్ ప్లే, యాక్షన్ సన్నివేశాలు రూపొందించిన విధానంపై సెన్సార్ అధికారులు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాకు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలుగా అంటే.. 157 నిమిషాల రన్ టైమ్‌ను సెట్ చేశారు. ఈ సినిమా పూర్తిగా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది అని విషయాన్ని సూచన ప్రాయంగా తెలిపారని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు.
































