నేటి నుంచి మారనున్న రూల్స్ ఇవే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో సహా మారేవి ఇవే.

సెప్టెంబర్ నెల వచ్చేసింది. ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా కొన్ని రూల్స్ మారనున్నాయి. సెప్టెంబర్‌లో, ఆధార్ కార్డ్ అప్‌డేట్, ఐటీఆర్, యూపీఎస్ క్రెడిట్ కార్డ్ నియమాలలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.


అలాగే, ప్రతి నెలలాగే, LPG గ్యాస్ ధరలు కూడా ప్రభావితం కావచ్చు. జెట్ ఇంధనం, CNG-PNG ధరలో మార్పు ఉండవచ్చు. ఈ మార్పులు సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరి నేటి నుంచి ఏవేం మారనున్నాయో ఇప్పుడు చూద్దాం.

ఐటీఆర్ దాఖలు

ఈసారి ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీని జూలై 30 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది. దీని కారణంగా పన్ను చెల్లింపుదారులకు రిటర్న్లు దాఖలు చేయడానికి అదనపు సమయం లభించింది. అయితే సెప్టెంబర్ 15 లోపు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు నోటీసు రావచ్చు.

యూపీఎస్ గడువు

జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) కిందకు వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏకీకృత పెన్షన్ పథకం (UPS) ఎంచుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఉంది. ముందుగా ఈ తేదీ జూన్ 30, కానీ తరువాత దానిని సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రారంభించబడిన పెన్షన్ పథకం.

భారతీయ పోస్ట్ నియమాలు

పోస్ట్స్ డిపార్ట్మెంట్ (DOP) సెప్టెంబర్ 1, 2025 నుంచి దేశీయ పోస్టల్ సర్వీస్‌ను స్పీడ్ పోస్ట్ సర్వీస్‌తో విలీనం చేస్తోంది. అంటే ఇప్పుడు ఏదైనా సాధారణ పోస్ట్ ద్వారా కాకుండా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సెప్టెంబర్ 1 నుంచి దేశంలోని ఇండియా పోస్ట్ ద్వారా ఏదైనా రిజిస్టర్డ్ పోస్ట్ పంపితే, అది స్పీడ్ పోస్ట్ డెలివరీ అవుతుంది.

క్రెడిట్ కార్డ్ నియమాలు

SBI క్రెడిట్ కార్డ్ సెప్టెంబర్ 1, 2025 నుంచి ఎంపిక చేసిన కార్డుల నియమాలలో మార్పులను ప్రకటించింది. కొన్ని కార్డులకు రివార్డ్ పాయింట్ల ప్రోగ్రామ్‌ను సవరించింది. ఈ సవరణతో, అటువంటి కార్డులను కలిగి ఉన్న కస్టమర్‌లు డిజిటల్ గేమింగ్, ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో లావాదేవీలకు సంబంధించిన ఖర్చులపై రివార్డ్ పాయింట్లను సంపాదించలేరు.

ప్రత్యేక FD పథకాలు

ఇండియన్ బ్యాంక్, IDBI బ్యాంక్ వంటి బ్యాంకులు ప్రస్తుతం కొన్ని ప్రత్యేక కాలపరిమితి FDలను నిర్వహిస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్, 444-రోజుల, 555-రోజుల పథకాలలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2025. అదేవిధంగా, IDBI బ్యాంక్ 444-రోజుల, 555-రోజుల, 700-రోజుల ప్రత్యేక FDలలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ కూడా సెప్టెంబర్ 30.

LPG సిలిండర్ ధర

ప్రతి నెల లాగే, సెప్టెంబర్ 1 నుంచి LPG సిలిండర్ ధర కూడా మారవచ్చు. గత కొన్ని నెలలుగా వాణిజ్య సిలిండర్ల ధర మారుతూ వస్తోంది. గత నెల కూడా వాణిజ్య సిలిండర్ల ధర మారింది. ఆగస్టులో, వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 33.50 తగ్గింది. చమురు కంపెనీలు LPG తో పాటు CNG, PNG, జెట్ ఇంధనం (AFT) ధరలను మారుస్తాయి. సెప్టెంబర్ నెల నుంచి వాటి ధరలు కూడా మారే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.