నటుడు మురళీమోహన్ సినిమా రంగం కన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువగా రాణించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక తిరుగులేని బిజినెస్ మాన్ గా పేరు సంపాదించు కున్నారు.
భూమిపై ఇన్వెస్ట్ మెంట్ చేయాలని తద్వారా భవిష్యత్తులో అది మీకు భద్రతను కల్పిస్తుందని మీ సంపదను పెంచుతుందని ఆయన ప్రతి ఒక్కరికి సలహా ఇస్తూ ఉంటారు. జయభేరి సంస్థను స్థాపించి అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ఆయన నిర్మించారు. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మందికి ఆయన ఒక దిక్సూచిగాను మార్గదర్శిగా నిలబడ్డారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నటుడు మురళీమోహన్ పలు ఇంటర్వ్యూలలో తన సక్సెస్ సీక్రెట్స్ తెలిపారు వీటిలో ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడానికి ఎంతగానో చాలామందికి ఉపయోగపడ్డాయి. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో చక్కగా లాభాలతో రాణిస్తున్న వారికి మురళీమోహన్ మార్గదర్శిగా నిలబడ్డారు. రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ అయ్యేందుకు నటుడు మురళీమోహన్ చెప్పిన ఐదు సక్సెస్ సీక్రెట్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. సరైన స్థలంలో పెట్టుబడి చేయాలి
రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ముఖ్యమైనది సరైన సమయంలో సరైన స్థలంలో పెట్టుబడి పెట్టడమే ముఖ్యమని చెప్పవచ్చు. మీ పెట్టుబడిని ఏదైనా ఒక స్థలం పై పెడుతున్నప్పుడు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది దీనికోసం మార్కెట్ రీసర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది. అందుకోసం మీరు కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు ఎంపిక చేసుకున్న స్థలం భవిష్యత్తులో అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉందా లేదా అనేవి తెలుసుకోవాలి.
2. కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను లక్ష్యంగా పెట్టాలి
మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఆ భూమి విలువ భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టులు పరిశ్రమలు దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
3. నమ్మకమైన డాక్యుమెంట్లు, లీగల్ క్లారిటీ
మీరు పెట్టుబడి పెట్టే ముందు కచ్చితంగా చూడాల్సింది డాక్యుమెంట్స్ క్లియర్ ఉంటేనే మీరు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టిన స్థలం లిటిగేషన్లో ఉన్నట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
4. Development Stages చూసి కొనుగోలు చేయాలి
మీరు ఒక ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలి అనుకున్నట్లయితే ఆ ప్రాంతం అభివృద్ధి దశలను అంచనా వేసుకొని పెట్టుబడి పెట్టినట్లయితే మీకు కావాల్సిన మొత్తం రిటర్న్ లభిస్తుంది. . అప్పుడే మీరు పెట్టిన పెట్టుబడికి చక్కటి విలువ లభిస్తుంది.
5. ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్స్ అర్థం చేసుకోవాలి
మార్కెటింగ్ ట్రెండ్స్ అర్థం చేసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు. నిజానికి మీరు పెట్టుబడి పెట్టే ముందు కచ్చితంగా మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.
































