సినీ ప్రియులకు పండగే.. సెప్టెంబర్‌లో ఎన్ని చిత్రాలు విడుదల కాబోతున్నాయో తెలిస్తే ఎగిరి గంతేయ్యాల్సిందే

 ప్రతి నెల భారీ ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఆగస్టు నెలకు మించి సెప్టెంబర్‌లో వినోదాన్ని పంచడానికి భారీ చిత్రాలు విడుదల సిద్ధంగా ఉన్నాయి.


ఏకంగా ఒకే రోజు నాలుగైదు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలలో సినీ ప్రియులు పండుగ చేసుకోవచ్చు. వారంలో కనీసం మూడు, నాలుగు మూవీస్ అయినా విడుదల కాబోతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. సెప్టెంబర్ నెల మొత్తం సినిమాల పండుగ చేసుకోవచ్చు అయితే ఏ చిత్రాలు విడుదల కాబోతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

*ఘాటి: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty), క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’. గంజాయి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది.

*లిటిల్ హార్ట్స్: మౌలి, శివాని నాగరం జంటగా నటించిన మూవీ ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ సినిమాకు ఈటీవీ విన్ ఒరిజిపల్ ప్రొడక్షన్‌లో రూపొందింది. ఈ మూవీ కూడా సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది.

*మదరాసి: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan), ఏఆర్ మురుగదాస్ కాంబోలో రాబోతున్న చిత్రం ‘మదరాసి’. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది.

*ది బెంగాల్ ఫైల్స్: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన ‘ది బెంగాల్ ఫైల్స్’ సెప్టెంబర్ 5న రాబోతుంది. పల్లవి జోషి, మిధున్న చక్రవర్తి, సిమ్రాత్ కౌర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో 1946 గ్రేట్ కోల్‌కత్తా హత్యలు, నోఖాలి అల్లర్ల ఆధారంగా రాబోతుంది.

*బాఘీ-4: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా ఏ హర్ష దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘బాఘీ-4’. హర్నాజ్ సంధు, సోనమ్ బజ్వా, సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది.

*బ్యాడ్‌గర్ల్: అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వివాదాస్పద మూవీ ‘బ్యాడ్ గర్ల్’. వర్షా భరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముందే వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచింది. మొత్తానికి చిక్కుల్లోంచి బయటపడి సెప్టెంబర్ 5న ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది.

సెప్టెంబర్ 12న రిలీజ్ అయ్యే సినిమాలు…

* కిష్కిందపురి: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘కిష్కిందపురి’ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో టీమ్ ఫుల్ బిజీ అయిపోయింది.

*మిరాయ్: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

*కాంత: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే నటించిన మూవీ ‘కాంత’. సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానా నిర్మిస్తున్నారు. 1950ల మద్రాస్ నేపథ్యంలో రూపొందిన కాంత, చరిత్రలో ఒక డైనమిక్ కాలంలో మానవ సంబంధాల సంక్లిష్టతలను, సామాజిక మార్పులను చూపించనుంది.

సెప్టెంబర్ మూడో వారంలో రాబోతున్న చిత్రాలు

*కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని, అరుణ్ ప్రభు కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘భద్రకాళి’. రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదల కాబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

* జాలీ ఎల్ఎల్‌బీ-3: ఇక అదే రోజు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కూడా విడుదలకు సిద్ధమైంది. ఈ కోర్ట్ రైం డ్రామా ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది.

*కిస్: సతీష్ కృష్జన్, కవిన్ కాంబోలో రాబోతున్న రొమాంటిక్ కామేడీ మూవీ ‘కిస్’. ఇందులో ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటించగా.. రొమియే పిక్చర్స్ నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ సెప్టెంబర్ 19 విడుదల కానుంది.

బాక్సాఫీసును షేక్ చేయడానికి సోలోగా రాబోతున్న పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ఓజీ’. సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. డీవీవీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ‘ఓజీ’ భారీ అంచనాలతో సోలోగా సెప్టెంబర్ 25న విడుదల కాబోతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.