డిప్లొమా, బీటెక్, ఎంటెక్ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీ జీతంతో జాబ్స్

నిరుద్యోగ అభ్యర్థులకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. దేశంలో అతిపెద్ద ట్రాన్స్‌మిషన్‌ యుటిలిటీ అయిన ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో 1,543 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

మొత్తం ఖాళీలు..

1543

పోస్టులు..

  • ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 532 పోస్టులు
  • ఫీల్డ్ ఇంజినీర్ (సివిల్): 198 పోస్టులు
  • ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్): 535 పోస్టులు
  • ఫీల్డ్ సూపర్వైజర్ (సివిల్): 193 పోస్టులు
  • ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 85 పోస్టులు

విద్యార్హత..

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55% మార్కులతో

డిప్లొమా

బీఈ/బీటెక్

ఎంఈ/ఎంటెక్

సంబంధిత విభాగంలో విద్యార్హత ఉండాలి.

వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.

ఎంపిక ప్రక్రియ..

అభ్యర్థులను రాతపరీక్ష + ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది.

రాత పరీక్షలో:

టెక్నికల్ నాలెడ్జ్ – 50 ప్రశ్నలు

ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్) – 25 ప్రశ్నలు

ఎగ్జామ్ సెంటర్లు..

ఢిల్లీ

భోపాల్

కోల్‌కతా

బెంగళూరు

గౌహతి

ముంబై

వయస్సు పరిమితి..

2025 సెప్టెంబర్ 17 నాటికి 29 సంవత్సరాలు మించరాదు.

వేతనం..

ఫీల్డ్ ఇంజినీర్: నెలకు రూ.30,000 – రూ.1,20,000

ఫీల్డ్ సూపర్వైజర్: నెలకు రూ.23,000 – రూ.1,05,000

దరఖాస్తు ఫీజు..

ఫీల్డ్ ఇంజినీర్: రూ.400

ఫీల్డ్ సూపర్వైజర్: రూ.300

SC/ST, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ – ఫీజు మినహాయింపు

దరఖాస్తు గడువు..

2025 ఆగస్టు 27 నుంచి 2025 సెప్టెంబర్ 17 వరకు

సూచనలు..

  • దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ (ఫోటో, సంతకం, విద్యార్హత సర్టిఫికేట్లు, కేటగిరీ సర్టిఫికేట్) రెడీగా ఉంచుకోవాలి.
  • ఒక్కో అభ్యర్థి ఒకేసారి ఒక పోస్టుకే అప్లై చేయాలి.
  • వయస్సు, విద్యార్హత ప్రమాణాలను ఖచ్చితంగా చెక్ చేయాలి.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.powergrid.in/job-opportunities చూడొచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.