ఇక టీచర్లకు టెట్‌ పాస్‌ తప్పనిసరి: సుప్రీంకోర్టు

2009 తర్వాత నియమితులైనవారూ ఉత్తీర్ణులు కావాల్సిందేలేదంటే రిటైర్‌ తప్పదు
ఈ తీర్పుతో రాష్ట్రంలో 30 వేల మందిపై ప్రభావం


నాడు, దిల్లీ, హైదరాబాద్‌: విద్యాహక్కు చట్టం(ఆర్‌టీఈ) అమల్లోకి వచ్చిన 2009 తర్వాత నియమితులైన టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి.

పదోన్నతి పొందాలన్నా టెట్‌ పాస్‌ కావాల్సిందే. ఈ మేరకు తమిళనాడుకు సంబంధించిన కేసులో జస్టిస్‌ దీపాంకర్‌దత్త, జస్టిస్‌ మన్మోహన్‌లతోకూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై ఈ తీర్పు ప్రభావం పడనుంది. తెలంగాణ విషయంలో 2012 డీఎస్సీ నుంచి టెట్‌ అమలవుతోంది.

రాష్ట్రంలో 1.10 లక్షల మంది టీచర్లు ఉండగా.. వారిలో 30 వేల మంది రెండేళ్లలోపు టెట్‌ పాస్‌ కావాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నిర్దేశిత గడువులోపు టెట్‌ పాస్‌కాకుంటే వారు ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుందని, అలాంటివారిని విధిగా ఉద్యోగ విమరణ చేయించి, సంబంధిత బెనిఫిట్స్‌ ఇవ్వాలని ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది. ఒకవేళ 2009 తర్వాత నియమితులై..

పదవీ విరమణకు ఐదేళ్లలోపు సర్వీస్‌ ఉంటే వారికి టెట్‌ అవసరం లేదు. వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్‌ పాస్‌ కావాల్సిందే. అయితే 2009 తర్వాత పదోన్నతి పొందిన వారు టెట్‌ పేపర్‌-2 ఉత్తీర్ణులు కావాలా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.