అందమైన, ప్రకాశవంతమైన క్లీన్ స్కిన్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే చాలా మంది చర్మం అకాలంగా వృద్ధాప్యంలోకి వెళ్లిపోతుంది. దీంతో వయసు మించి పెద్దవారుగా కనిపిస్తారు.
ముఖంపై ముడతలు అధికంగా ఉంటమే ఇందుకు కారణం. మీకు కూడా ముఖ్యం ముడతల సమస్య ఉంటే.. ప్రతిరోజూ ముఖానికి కలబంద అప్లై చేయండి. ఇది సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.
ముఖంపై ముడతలు అధికంగా ఉంటమే ఇందుకు కారణం. మీకు కూడా ముఖ్యం ముడతల సమస్య ఉంటే.. ప్రతిరోజూ ముఖానికి కలబంద అప్లై చేయండి. ఇది సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.
ఇది ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు, ముడతలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. దాదాపు అందరికీ ముఖం మీద ముడతల సమస్య ఉంటుంది. అయితే మీరు ప్రతిరోజూ ముఖానికి కలబందను అప్లై చేస్తే ముడతల సమస్య శాశ్వతంగా తగ్గుతుంది.
అలాగే పసుపును కలబందతో కూడా కలపి అప్లై చేయవచ్చు. ఇలా పసుపును కలిపి రాసుకుంటే అనతి కాలంలోనే అది చర్మం తెల్లబడటానికి కూడా సహాయపడుతుంది.
అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు కలబంద వాడకంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. దీనిలోని కొన్ని పదార్థాలు దురద, ఎర్రబారడం, మంట, దద్దుర్లు కలిగించవచ్చు. కాబట్టి ముఖానికి వాడే ముందు చేతికి కొద్దిగా రాసి 24 గంటలు ఆగాలి. ఎటువంటి సమస్య లేకపోతే అప్పుడు ముఖానికి అప్లై చేయవచ్చు.
































