ఏపీలో ఈసారి నెలముందే ఇంటర్ పరీక్షలు

ఈసారి ఇంటర్‌ పరీక్షల విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇంతకు ముందు లాంగ్వేజ్‌ పరీక్షలు ముందుగా నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది గ్రూప్‌ సబ్జెక్టుల పరీక్షలు ముందు జరగనున్నాయి. ఎంపీసీ గ్రూపు వారికి మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ వారికి బోటనీ, జువాలజీ పరీక్షలు అయ్యాక.. చివరలో లాంగ్వే జ్ పరీక్షలు జరుగుతాయి. అనంతరం ఆర్ట్స్‌ గ్రూపు పరీక్షలు ప్రారంభమవుతాయి. గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉన్నప్పుడు బైసీపీ, ఆర్ట్స్‌ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టుల పరీక్షలు జరిగేవి. ఈ ఏడాది కొత్తగా ఎంబైపీసీ గ్రూపును తీసుకురావడంతో.. ఎంపీసీ విద్యార్థులు కూడా బయాలజీ చదివే అవకాశం వచ్చింది. అందువల్ల ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు గనుక రోజుకు ఏదో ఒక సబ్జెక్టు పరీక్షే నిర్వహిస్తారు. కాగా, ప్రాక్టికల్‌ పరీక్షలను జనవరి చివరలో నిర్వహించాలా? రాత పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.