పోస్టర్: రక్తపు వీధుల్లో OG పవర్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజీ”పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.


డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ స్టార్డమ్‌తోపాటు, సుజీత్ స్టైలిష్ మేకింగ్‌పై ఉన్న నమ్మకం ఈ సినిమాపై హైప్‌ని పెంచేశాయి.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, సాంగ్స్ పవన్ అభిమానుల్లో ఊహించని ఎక్సైట్మెంట్ తెచ్చాయి. తాజాగా మరోసారి బర్త్‌డే స్పెషల్‌గా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్ హృదయాలను తాకింది. ఈ కొత్త అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు మరింత ఎత్తుకు వెళ్లాయి. ఈ తాజా పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ బ్లాక్ డాడ్జ్ కార్‌పై కూల్‌గా కూర్చున్న స్టైల్ అటిట్యూడ్‌తో దర్శనమిచ్చారు.

రఫ్ బియర్డ్, డార్క్ షర్ట్, స్టైలిష్ లుక్స్‌లో ఆయన మాస్ ప్రెజెన్స్ హైలైట్‌గా నిలిచింది. వెనుక ముంబై బిల్డింగ్స్ బ్యాక్‌డ్రాప్ పోస్టర్‌కు మరో లెవెల్ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. వీధుల్లో రక్తం చిందుతున్న సీన్ వెనక డైలాగ్ లైన్ “వీధుల్లో రక్తం అగ్ని పండుగగా మారుతుంది” అనేది ఫుల్ ఫైర్‌నే సూచిస్తోంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్‌గా కనిపించనున్నారు.

అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ వంటి నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. పవన్ పవర్‌ను కొత్త యాంగిల్‌లో చూపించేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. థమన్ సంగీతం ఈ సినిమాకి మరో హైలైట్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫైర్‌స్టార్మ్ సాంగ్ మాస్ బీట్‌తో అభిమానుల్లో గూస్ బంప్స్ తెచ్చింది. ఇక రెండో సాంగ్ “సువ్వి సువ్వి” మెలోడీగా హృదయాలను కదిలించింది.

థమన్ సౌండ్‌ట్రాక్‌తో సినిమా థియేటర్స్‌లో ఫుల్ ఫెస్టివల్ వాతావరణం సెట్ అవుతుందని ట్రేడ్ అంచనాలు వ్యక్తం చేస్తున్నాయి. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న “ఓజీ”కు పోటీగా నిలిచే పెద్ద సినిమాలు లేవు. దీంతో ఈ మూవీకి ఫుల్ ఫేవరబుల్ అట్మాస్ఫియర్ దొరికింది. ఇప్పటికే ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కావడంతో, ఓపెనింగ్స్ దగ్గరే ఆల్ టైం రికార్డ్స్ బద్దలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.