వివో నుంచి వాటర్‌ఫ్రూఫ్ మొబైల్.. 8,200mAh బ్యాటరీతో మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్!

Vivo స్మార్ట్ఫోన్ అతి తక్కువ సమయంలోనే ప్రపంచ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కొత్త కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.


ఇప్పటివరకు ఎన్నో స్మార్ట్ఫోన్లు లాంచ్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు మరొక మొబైల్ను చైనాలో లాంచ్ చేసింది. అదే Vivo Y500 మొబైల్. ఈ హ్యాండ్సెట్ 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్ను కలిగి ఉంది.

Vivo Y500 మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో పనిచేస్తుంది. 12GB వరకు RAM, 512GB వరకు ఆన్బోర్డ్ స్టోరేజ్తో వస్తుంది. Vivo Y500 వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. దీనికి 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్ అందించారు. ఈ Vivo Y500 హ్యాండ్సెట్ 8,200mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు మరెన్నో అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లను Vivo Y500 మొబైల్ కలిగి ఉంది. ఇప్పుడు దీని ధర, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Vivo Y500 Price

Vivo Y500 మొబైల్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 17,000గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 19,700 గా ఉంది. అదే సమయంలో ఈ Vivo Y500 హ్యాండ్సెట్ 12GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,000గా ఉంది. దీని టాప్ మోస్ట్ వేరియంట్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,700 గా కంపెనీ నిర్ణయించింది.

Vivo Y500 స్మార్ట్ఫోన్ మూడు కలర్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అవి- బ్లాక్, గ్లేసియర్ బ్లూ, డ్రాగన్ క్రిస్టల్ పర్పుల్ వేరియంట్లు. ఇది ప్రీ-ఆర్డర్ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 5 నుండి షిప్పింగ్ ప్రారంభమవుతుంది.

Vivo Y500 Specs

Vivo Y500 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది డ్యూయల్ సిమ్ (నానో + నానో)తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆరిజిన్ OS 15 పై నడుస్తుంది. Vivo Y500 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్తో 6.77-అంగుళాల ఫుల్ HD+ (2,392 x 1,080 పిక్సెల్స్) AMOLED స్క్రీన్ను కలిగి ఉంది.

ఈ Vivo Y500 హ్యాండ్సెట్ 4nm MediaTek Dimensity 7300 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇక ఈ మొబైల్ కెమెరా విషయానికొస్తే.. Vivo Y500 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ను పొందుతుంది. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్ల కోసం ఈ హ్యాండ్సెట్ 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.

ఇకపోతే Vivo Y500 లోని కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికొస్తే.. ఇది 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.4, USB టైప్-C, GPS, Beidou, GLONASS, Galileo, QZSS, NFC ఫీచర్లను కలిగి ఉంది. ఈ హ్యాండ్సెట్ 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 8,200mAh బ్యాటరీని కలిగి ఉంది.Vivo Y500 మన్నిక కోసం IP68 + IP69 + IP69+ రేటింగ్లను కలిగి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.