అరటి పండ్లే కాదు అరటి చెట్టు నుంచి వచ్చే అరటి పువ్వు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. అరటి పువ్వు శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . అంతే కాదు ఇందులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి..
అరటిపండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. కానీ అరటి చెట్టు నుంచి వచ్చే అరటి పువ్వు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. అరటి పువ్వు శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . అంతే కాదు ఇందులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. అరటి పువ్వుతో వివిధ ప్రాంతాల్లో ఎన్నో రుచికరమైన వంటలు తయారు చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఇన్ని ఉపయోగాలున్న ఈ పువ్వు ఎలాంటి ఆరోగ్య సమస్యలకు మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..
డయాబెటిస్
టైప్ 2 డయాబెటిస్ రోగులకు అరటి పువ్వు ఒక దివ్య ఔషధం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఈ పువ్వును క్రమం తప్పకుండా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఒత్తిడి, నిరాశ నుంచి ఉపశమనం
అరటిపండ్లలో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు ఒత్తిడిని ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. నిరాశ సంబంధిత సమస్యల నుంచి కూడా మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.
జీర్ణవ్యవస్థ పదిలం
అరటి పువ్వు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది కడుపు సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే అరటి పువ్వును క్రమం తప్పకుండా తినడం చాలా మంచిది.
రక్తహీనత
ఐరన్ అధికంగా ఉండే అరటి పువ్వు రక్తహీనతను నివారించడానికి ప్రభావవంతమైన ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు, రక్తహీనతకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల నుంచి కూడా దూరంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. మీరు కూడా రక్తహీనతతో బాధపడుతుంటే అరటి పువ్వును క్రమం తప్పకుండా తినడం మంచిది.
































