బీ12 పై దృష్టి పెట్టండి

నకు అత్యావశ్యకమైన విటమిన్లలో బీ12 ఒకటి. ఇది మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మారుస్తూ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుంది. మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతూ ఏ విషయంపైనైనా దృష్టి కేంద్రీకరించడానికి ఉపకరిస్తుంది.


జ్ఞాపకశక్తిని, మానసిక స్పష్టతను ఇస్తుంది. నరాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. రాత్రంతా గాఢంగా నిద్రపోయినా బీ12 తక్కువైతే అలసటగా అనిపిస్తుంది. ప్రస్తుతం మనలో చాలా మంది బీ12 లోపంతో బాధపడుతున్నారు. దాన్నుంచి బయటపడేందుకు అది సమృద్ధిగా లభించే మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులను తగినంతగా తీసుకోవాలి.

గాబే ప్లగుజ్‌ , హెల్త్‌ కోచ్‌

నిర్జలీకరణకు మందు.. సముద్ర ఉప్పు కలిపిన నీరు

శరీరంలో నిర్జలీకరణ స్థితి మనం ఊహించిన దానికంటే అత్యంత ప్రమాదకరమైంది. ఆ పరిస్థితిలో మన మెదడు పనితీరు మందగిస్తుంది. కండరాలు బలహీనమవుతాయి. నిర్దిష్ట ఆహారం కోసం శరీరం తీవ్రంగా పరితపిస్తుంటుంది. వీటిని అధిగమించేందుకు..1. ఉదయమే ఖాళీ కడుపుతో తగినంత నీటిని తాగాలి. దీంతో శరీర జీవక్రియలు, జీర్ణశక్తి మెరుగవడంతోపాటు మెదడు కణాలు పునరుజ్జీవం పొందుతాయి. 2 సముద్ర ఉప్పు కలిపిన నీటిని తీసుకోవాలి. అందులోని ఖనిజాలు శరీర కణాలు నీటిని శోషించుకునేలా చేస్తాయి. 3. ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా నీటిని తీసుకోవాలి. దీంతో రక్త పరిమాణం స్థిరంగా కొనసాగుతుంది. 4. వ్యాయామం చేశాక ఎలక్ట్రోలైట్స్‌తో కూడిన సమతుల నీటిని తీసుకోవాలి.

లెడీ, ఫిట్‌నెస్‌ రచయిత

అనుమతులు అవసరంలేదు

నువ్వు రచయిత కావాలను కుంటున్నావా? అయితే రచనలు మొదలు పెట్టు. ప్రోగ్రామర్‌గా ఎదగాలంటే.. కోడింగ్‌ చెయ్యి. మారథానర్‌గా ఖ్యాతి గాంచాలంటే..పరుగు తీయడం ప్రారంభించు..ఇలా నువ్వు ఏం కావాలనుకుంటే ఆ దిశగా చిన్నగానైనా ప్రయత్నం మొదలు పెట్టు..దీనికి ఎవరి అనుమతులు అవసరం లేదు.

బ్రియాన్‌ ఫెరోల్డి, వ్యాపార విశ్లేషకుడు

అపార్థాలు, సవాళ్లూ మంచివే

మానవసంబంధాల్లో ఒక్కోసారి అపార్థాలు, సవాళ్లు కూడా అనుబంధాలు బలోపేతం అయ్యేందుకు, ఒకరికొకరు మరింత దగ్గరయ్యేందుకు అవకాశాలు కల్పిస్తాయి. అయితే ఇటువంటి సందర్భాల్లో అర్థం చేసుకోవడానికి రెండువైపుల నుంచి ప్రయత్నం జరగాలి. ఒకవైపు నుంచే జరిగే యత్నాలు అసమతుల్యతకు దారితీయొచ్చు. సరిదిద్దడానికి అవకాశంలేని పరిస్థితులు ఎదురైనప్పుడు వివేకం, దయతో ప్రవర్తించాలి.

గౌర్‌ గోపాల్‌దాస్, ఆధ్యాత్మికవేత్త

పెట్టుబడికి ముందు..

ఆర్థికంగా ఏం సాధించాలనే స్పష్టత లేకపోతే ఏ సలహా చూసినా గొప్పగానే అనిపిస్తుంది. కాబట్టి ముందుగా నీ లక్ష్యాలను నిర్దేశించుకో. అవి నీ జీవితం నువ్వు కోరుకునే విధంగా సాగేందుకు ఉపయోగపడేలా ఉండాలి. నువ్వు అర్థం చేసుకోలేని రంగాల్లో పెట్టుబడి పెట్టకు. దీర్ఘకాల దృష్టితో ఆలోచించే మదుపు చేయాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.