శంఖపుష్పం ఈ మొక్క చాలా మందికి తెలుసు. ప్రతి ఒక్కరు ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. శంఖపుష్పం మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.
వాస్తు ప్రకారం శంఖ పుష్పం ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంటికి చాలా మంచిది. శంఖ పుష్పం ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ధన లాభం ఏర్పడుతుంది. కష్టాలు, నష్టాలు లేకుండా ఉంటారు. శంఖపుష్పం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మొక్క. వీటి పూలు శంకు ఆకారంలో ఉంటాయి. ఈ పువ్వులు దేవునికి ఎంతగానో ఇష్టం. లక్ష్మీదేవికి శంకు పూలు అంటే చాలా ఇష్టం. శంకు పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ ఇంట్లో సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లేనని పండితులు చెబుతున్నారు.
ఈ పూలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు. ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. శనీశ్వరుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. లక్ష్మీదేవికి మాత్రమే కాకుండా శివునికి కూడా శంకు పూలు అంటే చాలా ఇష్టం. శంకు పూలు పెట్టి దేవుడిని పూజించినట్లయితే ఆ పూలు శివుని వద్దకు చేరుతాయని పూర్వకాలం నుంచి చెబుతూ ఉంటారు. శంకు పూలు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇవి వైట్ మరియు బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటాయి. ఇది చూడడానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది.
ఈ మొక్క మరియు పువ్వులు పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం లేకుండా చూస్తాయి. ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల నరదృష్టి తగలకుండా ఉంటుంది. ఇంట్లో శంఖ పుష్పం పెంచుకోవడం వల్ల ఆరోగ్యానికి, ఇంటికి చాలా మంచిది. ఇక కొంతమంది శంకు పూలతో టీ చేసుకొనే తాగుతారు. ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యానికి చాలా మంచిది. మరిగే నీటిలో శంకు పూలను వేసి ఐదు నిమిషాల పాటు మరగబెట్టి ఆ తర్వాత ఆ నీటిని వడగట్టుకుని తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలని అనుకునేవారు శంకు పూలతో టీ చేసుకుని తాగుతూ ఉంటారు. దానివల్ల చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.
































