కొత్త టీచర్ల కు శిక్షణ, నియామకాల పై ప్రభుత్వం తాజా నిర్ణయం..

పీ ప్రభుత్వం డీఎస్సీ -2025 నియామక ప్రక్రియ వేగవంతం చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయటం.. శిక్షణ.. అప్పాయింట్ మెంట్ లెటర్ల జారీ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయటానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దసరా సెలవుల్లోకా కొత్త టీచర్లకు శిక్షణ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాగా, డీఎస్సీలో దాదాపు 700 పోస్టులు భర్తీ కాలేదని సమాచారం. వీటిని తదుపరి డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నియామకాల పైన నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. రెండో విడతలో 627 మంది అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపగా.. మంగళవారానికి వారిలో 480 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తిచేసి, సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారు. మొత్తంగా 15,600 మంది అభ్యర్థులే ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన పోస్టులను తర్వాత డీఎస్సీలో భర్తీ చేస్తారు. కాగా.. కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈలోపే వారు పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంది.

కాగా, మెగా డీఎస్సీలో ప్రకటించిన 16,347 పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారు 700 పోస్టులు మిగిలే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకూ జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనతో అధికారులు ఈ అంచనాకు వచ్చారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారి జాబితాలు ప్రకటిస్తారు.

అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. నియామక పత్రాల జారీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో భారీ స్థాయిలో నిర్వహించాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఇప్పుడు మిగిలే పోస్టులకు ఈ సారి ఇచ్చే డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.