పాలనాపరమైన వ్యవహారాల విషయంలో కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మొత్తం ముగ్గురికీ కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రధాన కార్యదర్శి (రాజకీయ విభాగం) ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
కేబినెట్ హోదా పొందిన వారిలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ (Rayapati Sailaja), ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కేఎస్ జవహర్ (KS Jawahar), ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ (Alapati Suresh) ఉన్నారు. అయితే, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు.
































