IP69 రేటింగ్‌, 7,000mAh భారీ బ్యాటరీతో Realme 15T లాంచ్.. ప్రీ-ఆర్డర్ చేస్తే ఆఫర్స్ కూడా బాసు

భారత మార్కెట్‌లో రియల్‌మీ (Realme) తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 15T (Realme 15T) ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీ ఉండగా, 60W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందిస్తోంది.


10W రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. అలాగే ఇందులో MediaTek Dimensity 6400 Max SoC వంటి మంచి ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది.

రియల్‌మీ 15T భారత మార్కెట్‌లో మూడు వెరియంట్లలో లాంచ్ అయింది. 8GB + 128GB వెరియంట్ ధర రూ.20,999గా నిర్ణయించగా, 8GB + 256GB మోడల్ రూ.22,999కు, 12GB + 256GB వెరియంట్ రూ.24,999కు అందుబాటులో ఉంది. ఇక కొనుగోలుదారుల కోసం కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ప్రకటించింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి ఎంచుకున్న బ్యాంక్ కార్డులపై EMI ట్రాన్సాక్షన్ ద్వారా రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఫుల్ స్వైప్ ట్రాన్సాక్షన్‌పై రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభించనుంది. అంతేకాదండోయ్.. జీరో డౌన్‌పేమెంట్‌తో 10 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ ఉంది.

వీటితోపాటు ముందుగా ప్రీ-బుకింగ్ చేసిన వారికి రియల్‌మీ ప్రత్యేక బహుమతిని కూడా అందిస్తోంది. ఇలా ప్రీ-బుకింగ్ చేసుకున్న వారికి Realme Buds T01 TWS ఇయర్‌ఫోన్స్‌ను ఉచితంగా పొందవచ్చు. అలాగే ఆఫ్‌లైన్ షాపింగ్ చేసేవారికి రూ.2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ.5,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, అలాగే తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI లభించనున్నాయి. మొత్తంగా చూస్తే, రియల్‌మీ 15T కేవలం స్పెక్స్‌తోనే కాకుండా ధర, ఆఫర్ల పరంగా కూడా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.

ఇక ఈ మొబైల్ ఫ్లోఇంగ్ సిల్వర్, సిల్క్ బ్లూ, సూట్ టైటానియం రంగుల్లో లభ్యం కానుంది. సెప్టెంబర్ 5 నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్‌మీ e-store తో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి. మరి ఇన్ని ఆఫర్స్ ఉన్న ఈ మొబైల్ ఫీచర్లను ఒకసారి చూసేద్దామా..

ప్రధాన ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.57 ఇంచ్ Full HD+ AMOLED (4,000 nits బ్రైట్నెస్, 2,160Hz PWM డిమ్మింగ్)

ప్రాసెసర్: 6nm MediaTek Dimensity 6400 Max SoC

స్టోరేజ్: 12GB RAM + 256GB స్టోరేజ్ వరకు

కెమెరా:రియర్ గా 50MP ప్రైమరీ + 2MP సెకండరీగా, ఫ్రంట్ 50MP సెల్ఫీ కెమెరా.. రెండు కెమేరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి.

కూలింగ్ సిస్టమ్: 6,050 sq mm AirFlow Vapour Chamber + 13,774 sq mm గ్రాఫైట్ షీట్

బ్యాటరీ:7,000mAh, 60W SuperVOOC + 10W రివర్స్ చార్జింగ్

సెక్యూరిటీ: ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్

కనెక్టివిటీ:5G, 4G, Wi-Fi, Bluetooth 5.3, GPS, USB Type-C

డిజైన్:7.79mm మందం, 181 గ్రాములు బరువు

రేటింగ్: IP66, IP68, IP69 (డస్ట్ & వాటర్ రెసిస్టెంట్)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.