విశాఖలో ఆ సర్టిఫికేట్ కచ్చితంగా తీసుకోవాల్సిందే.. ఆ తర్వాత అడిగినా ఇవ్వరు, వెంటనే దరఖాస్తు చేస్కోండి

విశాఖపట్నంవాసులకు ముఖ్యమైన గమనిక.. జనన ధ్రువీకరణలో పేరు లేదా.. అయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే ఇబ్బందులు తప్పవు. విశాఖపట్నం (జీవీఎంసీ) పరిధిలోని ఆస్పత్రులతో పాటుగా ఇళ్ల దగ్గర పుట్టిన పిల్లకు జారీ చేసే జనన ధ్రువీకరణ పత్రాల్లో (బర్త్ సర్టిఫికేట్) చాలా మంది తీసుకోలేదు.


చాలామంది 15 ఏళ్ల వరకు పేర్లు నమోదు చేసుకోవడం లేదని తేలింది. వచ్చే ఏడాది జనవరి 21లోగా జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోని వారంతా పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జనవరి 21 తర్వాత దరఖాస్తు చేసినా, పేరు నమోదు చేయబోమంటున్నారు అధికారులు. ఈ విషయాన్ని గమనించి బర్త్ సర్టిఫికేట్ తీసుకోని వారు తీసుకోవాలని సూచిస్తు్న్నారు.

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో మొత్తం 98 వార్డులు (అనకాపల్లి నుంచి భీమిలి వరకు) ఉన్నాయి. ప్రతిరోజూ జనన, మరణాలు ఉంటాయి.. అయితే దీనికి ( జనన, మరణాలు) సంబంధించి ప్రజారోగ్య విభాగం స్టాటిస్టికల్‌ అధికారి వివరాలు నమోదు చేస్తారు. జనన, మరణాలకు సంబంధించి అధికారి ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు చాలా కీలకం. వయస్సు నిర్ధారణతో పాటుగా బీమా డబ్బులు, ఇతర అవసరాలకు ఎంతో ముఖ్యం అంటున్నారు.

ఆస్పత్రులు, ఇంటి దగ్గర బిడ్డ పుట్టిన తర్వాత వెంటనే ఇచ్చే జనన ధ్రువీకరణ పత్రంలో ముందు తల్లిదండ్రుల పేర్లతో నమోదు చేస్తారు.. పిల్లల పేరు ఉండదు. తల్లిదండ్రులు పేరు పెట్టుకున్న తర్వాత సచివాలయంలో వివరాలను సమర్పించి దరఖాస్తు చేసుకుంటే.. ఆ తర్వాత గతంలో ఇచ్చిన పత్రంపై ఉన్న రిజిస్ట్రేషన్‌ నంబర్ ఆధారంగా పిల్లల పేరు చేరుస్తారు.. మరో జనన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. అయితే చాలామంది తల్లిదండ్రులు జనన ధ్రువీకరణ పత్రం కోసం వివరాలు నమోదు చేస్తున్నారు.. కానీ పేరు పెట్టిన తర్వాత మాత్రం దరఖాస్తు చేయడం లేదని తేలిందట.

ఈ సమస్యల్ని గమనించి 15 ఏళ్లలోపు పిల్లలందరికి గతంలో జనన ధ్రువీకరణ పత్రాల్లో వారి పేర్లు నమోదు చేయించే దిశగా జీవీఎంసీ అడులు వేస్తోంది. భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా జీవీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. జనన ధ్రువీకరణ పత్రంలో పిల్లల పేర్లతో కావాల్సిన వారంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 21లోగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. కొన్ని నర్సింగ్‌హోమ్‌లు, ఆసుపత్రులు CRS (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) వెబ్‌సైట్‌లో నమోదు కాలేదు. పుట్టిన శిశువుల వివరాలు నమోదు చేయడానికి ఇది అవసరం. ఆస్పత్రుల యాజమాన్యలు వెంటనే నమోదు చేసుకోవాలని, యూజర్ ఐడీ కోసం జీవీఎంసీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అధికారిని కలవాలని అధికారులు సూచించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.