నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్

 నేడు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు..


సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది కేబినెట్‌.. ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. పలు సంస్థలకు భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది.. కాగా, ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం..

ఇక, ఈ కేబినెట్‌ సమావేశం నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతోంది.. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ పర్యటనలు కొనసాగగా.. ఇప్పుడు రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.. రాజధానిలోని పలు ప్రాజెక్టులకు ఎస్పీవీకి అమోదం తెలపనుంది కేబినెట్.. అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ కు ఆమోద ముద్ర వేయబోతోంది.. కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులకు అమోదం తెలపబోతోంది మంత్రివర్గ సమావేశం.. రాజధాని ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని వాటిపై భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది కేబినెట్‌.. ఏరో స్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది కేబినెట్‌.. బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టంకు కూడా అనుమతి ఇవ్వబోతోంది ఏపీ కేబినెట్..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.