ప్రస్తుత జనరేషన్లో బైక్ లేనిదే సామన్య, మధ్యతరగతి ప్రజలకు జీవనం గడవడం లేదు. ముఖ్యంగా రోజువారీ పనుల్లో టూవీలర్ బైక్స్ (Two-wheeler bikes) నిత్యావసర వస్తువుగా మారిపోయింది.
అయితే ప్రస్తుతం ఏ బైక్ కొన్న రూ. లక్ష కంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ ఆ బైక్స్ ఒక లీటర్ పెట్రోల్ కు 40 నుంచి 80 మధ్యలో మైలేజ్ ఇస్తున్నాయి. ముఖ్యంగా బీఎస్ 5, 6 ఇంజన్ వాహనాలు అయితే 40 నుంచి 60 మధ్యలోనే మైలేజ్ ఇస్తున్నాయి. ఇది మధ్యతరగతి ఉద్యోగులు, సామాన్య ప్రజలకు తీవ్ర ఖర్చుగా మారుతోంది. అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ వ్యక్తి సిక్స్-స్ట్రోక్ ఇంజిన్ (Six-stroke engine) తయారు చేశాడు. సంవత్సరాల తరబడి తయారు చేసిన ఈ ప్రత్యేకమైన ఇంజన్ (unique engine) ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రకాల ఇంధనాలతో నడుస్తుంది.
అలాగే ఇది తక్కువలో తక్కువ లీటరుకు 176 కి. మీ నుంచి 200 వరకు మైలేజ్ ఇస్తుందని ఇంజన్ తయారు చేసిన వ్యక్తి నిరూపించారు. దీంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శైలేంద్ర గౌర్ (Shailendra Gaur) ఈ సంవత్సరాల తరబడి కష్టపడి సిక్స్-స్ట్రోక్ ఇంజిన్ (Six-stroke engine)ను సృష్టించాడు. 1 లీటరు పెట్రోల్‌తో 176 కి.మీ కంటే ఎక్కువ మైలేజీని ఇవ్వడంతో పాటు.. తక్కువ కాలుష్యాన్ని కలిగించడమే కాకుండా పెట్రోల్‌తో పాటు డీజిల్, సిఎన్జి, ఇథనాల్ వంటి వివిధ ఇంధనాలతో కూడా నడుస్తుందని నిరూపించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇలాంటి వ్యక్తులకు ప్రభుత్వాలు సపోర్ట్ గా నిలవాలని, అతను తయారు చేసిన సిక్స్-స్ట్రోక్ ఇంజిన్ వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
































