మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘SSMB29’. దీంతో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఆసక్తిగా అని ఎదురుచూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.
ఈ క్రమంలో ‘SSMB29’ సెట్స్ నుంచి లీకైన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. కెన్యాలోని నైరోబీలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఇటీవలే రాజమౌళి చిత్రబృందం ఈస్ట్ ఆఫ్రికాలోని కెన్యాలో కీలక సన్నివేశాలకు సంబంధించిన షెడ్యూల్ పూర్తి చేశారు. ఇందులో భాగంగానే ఈ ఫొటో లీకైనట్లు తెలుస్తోంది. సినిమాలో దాదాపు 95 % సౌత్ ఆఫ్రికన్ సీన్స్ కెన్యాలోనే చిత్రీకరించారు.
ఇదిలా ఉంటే కెన్యా షెడ్యూల్ పూర్తయిన తర్వాత డైరెక్టర్ రాజమౌళి కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదవాడిని మర్యాదపూర్వకంగా కలిశారు. షూటింగ్ కి కావాల్సిన అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాసేపు కాసేపు ముచ్చటించిన రాజమౌళి సినిమాకు సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను మంత్రి ముదావాది తన ట్విట్టర్ లో పంచుకున్నారు. కెన్యాలోని సుందరమైన ప్రదేశాలను తన చిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
































